Siddharth : కాలిఫోర్నియాలో యాపిల్ సంస్థ నిర్వహించిన ఇట్స్ ‘గ్లోటైమ్’ ఈవెంట్‌లో బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ చాలా మంది తళుక్కున మెరిశారు. సిద్ధార్థ్ తనకు కాబోయే భార్య అదితితో కలిసి వెళ్లారు. అక్కడ యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను కలిసి ఫొటోలు దిగారు. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ఆ రోజును ఎప్పటికీ మర్చిపోమనీ ఆ ఈవెంట్‌లో తామెంతో ఎంజాయ్ చేశామనీ రాసుకొచ్చారు.
Siddharth-Aditi Rao Meet
అత్యంత పెద్ద సాంకేతిక ప్రపంచంలో రెండు రోజులు గడిపామనీ ఎంతో అందమైన ఆ ప్రపంచంలో యాపిల్ సిబ్బంది ప్రేమ తమ మనసుల్ని హత్తుకుందనీ అన్నారు. వాళ్ల ప్రతిభ, ఆవిష్కరణలకు తాము ఆశ్చర్యపోయామనీ అలాంటి వ్యక్తులను కలవడంతో తమ హృదయాలు ఆనందంతో నిండిపోయినట్లు రాసుకొచ్చారు. ముఖ్యంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఎంతో వినయంగా పలకరించారనీ ఆయనకు తమ ప్రత్యేక ధన్యవాదాలు అంటూ టిమ్‌కుక్‌తో దిగిన ఫొటోలను పంచుకున్నారు సిద్ధార్థ్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
Also Read : Devara Movie : అర్జున్ రెడ్డి డైరెక్టర్ చిట్ చాట్ విత్ ‘దేవర’ టీమ్