Siddharth-Aditi : హీరో సిద్ధార్థ్ తో ఏడడుగుల బంధంలోకి ఎంటరైన అదితి రావు

అజయ్‌ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మహా సముద్రం’లో వీరిద్దరూ జంటగా నటించారు...

Siddharth-Aditi : నటుడు సిద్ధార్థ్‌ నటి అదితిరావు హైదరీ వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దక్షిణాది సంప్రదాయంలో వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. ‘‘ నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ అదు సిద్థు’’ అని అదితి క్యాప్షన్‌ ఇచ్చారు. నూతన జంటకు నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Siddharth-Aditi Marriage Updates

అజయ్‌ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మహా సముద్రం’లో వీరిద్దరూ జంటగా నటించారు. అక్కడ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సిద్ధార్థ్‌తో రిలేషన్‌ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అదితిరావు హైదరీ(Aditi Rao) మాట్లాడుతూ ుూనాకెంతో ఇష్టమైన ప్రదేశంలో సిద్ధార్థ్‌ నాకు ప్రపోజ్‌ చేశాడు. మా నాన్నమ్మ అంటే నాకెంతో ఇష్టం. హైదరాబాద్‌లో ఆమె ఒక స్కూల్‌ ప్రారంభించారు. అది నాకెంతో ప్రత్యేకం. నా చిన్ననాటి రోజులు అక్కడే ఎక్కువ గడిపాను. కొన్నేళ్ల క్రితం ఆమె కన్నుమూశారు. ఈ విషయం సిద్ధార్థ్‌కు తెలుసు. ఓ రోజు నా వద్దకు వచ్చి.. ఆ స్కూల్‌కు తీసుకువెళ్లమని అడిగాడు. మార్చిలో మేమిద్దరం అక్కడికి వెళ్లాం. మోకాళ్ల పై కూర్చుని.. అతను నాకు ప్రపోజ్‌ చేశాడు. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్‌ చేసినట్లు చెప్పాడు’’ అని అదితిరావు హైదరీ చెప్పారు.

Also Read : Reba Monica John : ఓనమ్ సంబరాల్లో అదరగొట్టిన నటి ‘రెబా మోనికా జాన్’

Aditi Rao HydarimarriageSiddharthTrendingUpdatesViral
Comments (0)
Add Comment