Siddarth Roy bold movie:ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ ‘సిద్ధార్థ్ రాయ్’ !

ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ ‘సిద్ధార్థ్ రాయ్’ !

Siddarth Roy:తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన తెలుగు చిత్రం ఎట్ట‌కేల‌కు డిజిటిల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. అత‌డు సినిమాలో బ్ర‌హ్మానందం కుమారుడిగా న‌టించి మెప్పించిన‌ బాల న‌టుడు దీపక్ సరోజ్ హీరోగా, త‌న్వి నేగి క‌థానాయిక‌గా తెర‌కెక్కిన‌ చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. ఫిబ్రవరి 23న థియేట‌ర్ల‌లో విడుదలైన ఈ చిత్రం యూవ‌త‌ను బాగా ఆక‌ట్టుకుంది. దాదాపు రెండు నెల‌ల గ్యాప్‌ త‌ర్వాత శుక్ర‌వారం సాయంత్రం నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

Siddarth Roy:

విడుద‌ల‌కు ముందు నుంచే రెండు తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఈ సినిమా ఆ స‌మ‌యంలో టాక్ ఆఫ్ ది టౌన్ కూడా అయింది. దానికి కార‌ణం ఇందులోని బోల్డ్‌ కంటెంట్‌. హైక్యూ అధికంగా ఉండి ప్రాక్టిక‌ల్‌ గా లైఫ్‌ను లీడ్ చేసే యువ‌కుడు సిద్ధార్థ్ రాయ్ (దీప‌క్ స‌రోజ్‌). చిన్న‌త‌నం నుంచే పుస్త‌కాలు విప‌రీతంగా చ‌దివి ప్ర‌స్తుత స‌మాజం ఫిలాస‌ఫీనంత‌టినీ అణువ‌ణువు ఒంట బ‌ట్టించుకుంటాడు. త‌న దైనందిన జీవితంలో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ప్ర‌తి దాంట్లో లాజిక్‌ ను మాత్ర‌మే ఫాలో అవుతూ అప్ప‌టిక‌ప్పుడే త‌న కోరిక‌ల‌ను తీర్చుకుంటూ అంతా నేనే అన్న‌ట్లుగా జీవిస్తుంటాడు.

ఈక్ర‌మంలో క‌థానాయిక ఇందు (త‌న్వి నేగి) ఎంట్రీ ఇచ్చాక సిద్ధార్థ్ రాయ్(Siddarth Roy) జీవితంలో చిన్న‌గా మార్పులు మొద‌లై అ అమ్మాయి ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ ఆ త‌ర్వాత త‌ను ప్రాక్టిక‌ల్‌గా జీవించ‌లేక ఎమోష‌న్స్‌ ను ఫీల్ అవ‌లేక తీవ్ర ఇబ్బందులు ఎద‌ర్కొంటుంటాడు. ఈ నేప‌థ్యంలో అంద‌రితో ర్యాష్‌ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మ‌రి చివ‌ర‌కు సిద్ధార్థ్ ల‌వ్‌ ను ఇందు అంగీక‌రించిందా… వారిద్ద‌రు ఒక్కటయ్యారా… చివ‌ర‌కు ఏమైంది అనేదే చిత్ర క‌థ‌. నేటి యూత్‌ను టార్గెట్‌గా చేస్తూ వ‌చ్చిన‌ సినిమాను ఫ్యామిలీ అడియన్స్‌తో క‌లిసి చూడ‌డం క‌ష్టం కాబ‌ట్టి పిల్ల‌ను ఈసినిమాకు దూరంగా ఉంచ‌డం బెట‌ర్‌.

Also Read:-Kubera Movie : అదరగొడుతున్న కింగ్ నాగార్జున ‘కుబేర’ మూవీ లుక్

ahaSiddarth Roy
Comments (0)
Add Comment