Sid Sriram : టాలీవుడ్ ట్రెండ్ మారింది. సినిమాలలో కంటెంట్ ప్రధానంగా ఉండేలా చూస్తున్నారు దర్శక, నిర్మాతలు. ప్రధానంగా అసభ్యతకు తావీయని కామెడీ, సున్నితంగా ఉండే రొమాన్స్ తో పాటు సినిమాకు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సంగీతం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. సినిమా సక్సెస్ లో పాటలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Sid Sriram Song..
ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాలకు తన గాత్రంతో ప్రాణం పోసిన సిద్ శ్రీరామ్(Sid Sriram) గొంతులోంచి మరో అద్బుతమైన , వీనుల విందైన , ఆహ్లాదకరమైన సాంగ్ నీవల్లె నీవల్లె పాట విడుదలైంది. ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చార్ట్స్ లో టాప్ లో నిలిచింది. ప్రత్యేకించి యువతను ఆకట్టుకుంటోంది ఈ సాంగ్.
త్రిబనాధరి బార్బరిక్ చిత్రంలోని ఈ పాట. ఇది అలలను సృష్టిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ దుమ్ము రేపుతోంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించి విజయ్ పాల్ రెడ్డి ఆదిదాల నిర్మించారు. ఈ చిత్రాన్ని విజయవంతమైన దర్శకుడు మారుతి సమర్పిస్తున్నారు.
వానర సెల్యులాయిడ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో లెజెండరీ సత్యరాజ్, ప్రతిభావంతులైన సత్యం రాజేష్, వసిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి అద్భుతమైన తారాగణం నటించారు.
ఈ చిత్రానికి ఇన్ఫ్యూజన్ బ్యాండ్ సంగీతం సమకూర్చింది. మొదటి సింగిల్ హల్ చల్ చేస్తోంది. గొప్ప, శ్రావ్యమైన వాయిద్యాలు , మంత్ర ముగ్ధులను చేసే వేణువు శబ్దాల చేరికతో శ్రోతలను అలరిస్తోంది.
Also Read : Hero Balayya-Adi Pinishetty : బాలయ్యతో ఆది పినిశెట్టి ఢీ