Shweta Basu Prasad: ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సినిమా ‘కొత్త బంగారు లోకం’. 2008లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అందులో తన అందం, అమయాకత్వం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది బెంగాలీ ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్. దూరదర్శిన్ సీరియల్స్ లో బాల నటిగా కెరీర్ ను ప్రారంభించిన ఈ బెంగాళీ ముద్దుగుమ్మ… అనతి కాలంలోనే బెంగాళి, తెలుగు, తమిళ భాషల సినిమాలతో పాటు హిందీ లో కూడా నటించి మెప్పించింది.
Shweta Basu Prasad New Look
‘కొత్త బంగారు లోకం’ సినిమాలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిన ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే స్టార్ గా గుర్తింపు దక్కించుకుంది. కానీ ఈ అమ్మడికి అదృష్టం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఈమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంతో ఆఫర్లు కనుమరుగయ్యాయి. దీనితో ఉత్తరాదికి మకాం మార్చిన శ్వేతా బసు ప్రసాద్(Shweta Basu Prasad)… మళ్లీ సౌత్ లో కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసం ఆ మధ్య బొద్దుగా కనిపించిన శ్వేతా బసు… ఈ మధ్య కాలంలో చాలా సన్నగా నాజూకుగా తయారు అయ్యింది.
ఈ నేపథ్యంలోనే క్రాప్ టాప్ లో క్లీ వేజ్ అందాలను చూపిస్తూ దక్షిణాదిన ఈ అమ్మడు సందడి చేస్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ తో తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో… ‘కొత్త బంగారు లోకం’ లోనికి మళ్ళీ తీసుకెళ్తావా అంటూ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీనితో హాట్ అండ్ స్టన్నింగ్ లుక్స్ లో ఉన్న శ్వేతా బసు ప్రసాద్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంతటి అందం స్టార్ హీరోయిన్స్ కి కూడా అసాధ్యం అంటూ ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ ఈమె సీరియస్ గా ప్రయత్నిస్తే వెబ్ సిరీస్ లు, మిడిల్ రేంజ్ సినిమా ఆఫర్లు వరుసగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇంతటి అందంను ఫిల్మ్ మేకర్స్ కచ్చితంగా లైట్ తీసుకోరు. కనుక త్వరలోనే మిమ్మల్ని వెండితెరపై చూస్తామంటూ నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
Also Read : Aa Okkati Adakku OTT : ఓటీటీకి సిద్ధమవుతున్న అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా