Shruti Marathe: స్టైలిష్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవర’. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులుగా విడుదల చేస్తున్న ఈ సినిమాను అక్టోబరు 10న మొదటి పార్టును విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
వాస్తవానికి ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేసినప్పటికీ… సినిమాలో యాక్సన్ సీక్వెన్స్ లో ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కు గాయాలు కావడంతో… తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా అక్టోబరు 10కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆ డేట్ ను మిస్ కాకుండా ఉండేందుకు చిత్ర యూనిట్… షూటింగ్ ను పరుగులు పెట్టిస్తుంది. ఈ నేపథ్యంలోనే గుజరాతీ భామ శ్రుతీ మరాఠే… ఈ సినిమా సెట్ లో ఎంట్రీ ఇచ్చింది.
Shruti Marathe
మరాఠీ, తమిళ భాషల్లో గుర్తింపు పొందిన శ్రుతీ మరాఠే(Shruti Marathe)… ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘దేవర’ షూటింగ్‌లో శ్రుతి జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని తన సోషల్ మాధ్యమాల వేదికగా ఆమె వెల్లడించారు శ్రుతి. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కాగానే పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ కేరళ వెళ్లాలనే ఆలోచనలో ఉందని సమాచారం. దీనితో చాలా షూటింగ్ పూర్తయిన తరువాత శ్రుతి ఈ సినిమా సెట్ లో జాయిన్ కావడంతో… ఆమె పాత్రపై ఆశక్తి నెలకొంది. దీనితో శ్రుతి కోసం… ఎన్టీఆర్ అభిమానులు నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు.
Also Read : Sreerama Chandra : ఒకప్పుడు ఇండియన్ ఐడల్ విన్నర్ ఎప్పుడు డాన్స్ షోలో కూడా..