Beauty Shruti Haasan :స్వంతంగా ఎద‌గాల‌ని పేరు మార్చుకున్నా

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన శ్రుతి హాస‌న్

Shruti Haasan : నాకు స్వ‌తంత్రంగా ఉండ‌టం అంటే ఇష్టం. ముందు నుంచీ నా క‌ష్టార్జితంతోనే నేను బ‌త‌కాల‌ని కోరుకున్నా. అలాగే ఉన్నా. ఎందుకంటే మ‌న‌పై ఇంకొక‌రి ప్ర‌భావం ఉండ‌కూడ‌ద‌నేది నా ఫిలాస‌ఫీ. అందుకు త‌గ్గట్టుగానే నాకు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగానే నేను బ‌తుకుతున్నా. ఇందులో ఎలాంటి భేష‌జాలు లేవ‌ని అంటోంది అందాల ముద్దుగుమ్మ‌, స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల త‌న‌య శ్రుతి హాస‌న్(Shruti Haasan). త‌నంటే క‌మ‌ల్ కు పిచ్చి ప్రాణం. త‌న‌కు కూడా త‌న తండ్రి అంటే చ‌చ్చేంత ఇష్టం.

Shruti Haasan Comments

నా తండ్రి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌న‌కు కూతురుగా పుట్ట‌డం దేవుడు ఇచ్చిన వ‌రం అంటోంది శ్రుతీ హాస‌న్. మా నాన్న నాకు ఎప్పుడూ ఒక మాట చెప్పే వారు. మ‌నం ఇంకొక‌రిని ప్రేమిస్తాం. ఆరాధిస్తాం. ఇంకొంద‌రిని స్పూర్తిగా తీసుకుంటాం. కానీ మంచిని తీసుకోవాలి. మ‌రింత‌గా ఎద‌గాలంటే ఎంచుకున్న కెరీర్ పై దృష్టి సారించాలి. ముందుగా నువ్వు ఏం కావాల‌ని అనుకుంటున్నావో దానిని డిసైడ్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత దానిని సాధించేందుకు క‌ష్ట‌ప‌డాలి. ఫ‌లితం వ్య‌తిరేకంగా వ‌స్తుందా లేక పాజిటివ్ గా వ‌స్తుందా అనేది ప‌ట్టించు కోవ‌ద్దు.

కానీ మ‌న‌పై ప్ర‌భావం ఉండ‌డం మంచిదే. కానీ అదే స‌మ‌యంలో మ‌న‌కంటూ ఓ ఇమేజ్ ఉండాలని చెప్పారు. అందుకే త‌న‌కు మొద‌టి గురువు, త‌ల్లి, తండ్రి క‌మ‌ల్ హాస‌నేన‌ని అంటోంది ఈ ల‌వ్లీ బ్యూటీ. త‌న అస‌లు పేరు శృతీ హాస‌న్ కాద‌ని, పేరు మార్చుకున్నాన‌ని అంటోంది.

Also Read : Director Utekar Shocking :మ‌న‌సు నొప్పిస్తే మ‌న్నించండి – ఉటేక‌ర్

CommentsShruti HaasanUpdatesViral
Comments (0)
Add Comment