Shruti Haasan-Coolie Sensational :శ్రుతీ హాస‌న్ కూలీ లుక్ సెన్సేష‌న్

త‌లైవా ర‌జ‌నీకాంత్ కీ రోల్

Coolie : త‌మిళ సినీ రంగంలో మోస్ట్ వాంటెడ్ హీరో ఎవ‌రైనా ఉన్నారంటే ఒకే ఒక్క‌డు త‌నే త‌లైవా ర‌జ‌నీకాంత్. త‌న ఇమేజ్ తోనే ఓ మూవీ కోట్లు కొల్ల‌గొడుతోంది. ఆ మ‌ధ్య‌న రిలీజ్ అయిన జైల‌ర్ దుమ్ము రేపింది. కాసుల వ‌ర్షం కురిపించింది. తాజాగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం కూలీ(Coolie). ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్, పోస్ట‌ర్స్, టీజ‌ర్ ఇప్ప‌టికే కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ఇందులో టాప్ న‌టులు న‌టిస్తుండ‌డం విశేషం. తాజాగా శ్రుతీ హాస‌న్ డైరెక్ట‌ర్ క‌లిసి మాట్లాడుతున్న ఫోటో రిలీజ్ చేశారు. ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

Shruti Haasan – Coolie Look Sensational

ఇక టేకింగ్ , మేకింగ్ లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త క‌లిగిన వ్య‌క్తి క‌న‌గ‌రాజ్. ఇక కూలీలో ర‌జ‌నీకాంత్ తో పాటు అక్కినేని నాగార్జున‌, ఉపేంద్ర‌, సౌబిన్ షాహిర్, స‌త్య రాజ్ , శ్రుతీ హాస‌న్ , రెబా మోనికా జాన్ , జూనియ‌ర్ ఎంజీఆర్, మోనిషా బైస్సీ న‌టిస్తుండ‌డంతో కూలీ పై మ‌రింత అంచ‌నాలు పెరిగాయి. ఇక తాజా పోస్ట‌ర్ హైలెట్ గా నిలిచింది.

ఇందులో సాధార‌ణ స‌ల్వార్ క‌మీజ్ లో ద‌ర్శ‌నం ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ శ్రుతీ హాస‌న్. మార్చి 14న క‌న‌గ‌రాజ్ పుట్టిన రోజు జ‌రుపుకున్నాడు. ఈ సంద‌ర్బంగా అభినంద‌ల‌తో ముంచెత్తారు ర‌జ‌నీకాంత్. చిత్ర బృందం. గత సంవత్సరం మార్చిలో లోకేష్ కనగరాజ్ కూలీ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అప్ప‌ట్లో అది సెన్సేష‌న్ గా నిలిచింది. ఇక కూలీ కోసం అద్భుత‌మైన సంగీతం అందించాడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్. త‌ను జైల‌ర్ కూడా మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది.

Also Read : Anasuya Shocking Comments :ఆంటీ అంటే చీరేస్తా ద‌మ్ముంటే దా

CinemaCoolieShruti HaasanTrendingUpdates
Comments (0)
Add Comment