Shruti Haasan: ప్రేమించడం ఒక భ్రమ అంటున్న శృతిహాసన్‌ !

ప్రేమించడం ఒక భ్రమ అంటున్న శృతిహాసన్‌ !

Shruti Haasan: కమల్ హాసన్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్‌… మంచి నటిగా, మంచి డ్యాన్సర్ గా, మంచి సింగర్ గా గుర్తింపు పొందింది. తెలుగు, తమిళంలో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించిన శృతిహాసన్‌… కోలీవడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ తో ఇటీవల ఓ స్పెషల్‌ సాంగ్‌లో కలిసి నటించింది. ‘ఇనిమేల్‌’ పేరుతో విడుదల చేసిన ఈ మ్యూజిక్‌ ఆల్బమ్‌ కు కమల్‌ హాసన్‌ లిరిక్స్‌ అందించారు. ద్వారకేశ్‌ ప్రభాకర్‌ దర్శకత్వం వహించగా… శృతిహాసన్‌ ఈ పాటను ఆలపించడంతో పాటు నటించారు. ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పాటకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు శృతిహాసన్‌. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Shruti Haasan Comments Viral

ఈ సందర్భంగా శృతిహాసన్‌(Shruti Haasan) మాట్లాడుతూ… ‘‘లోకేశ్‌ కనగరాజ్‌ అందరికీ దర్శకుడిగానే తెలుసు. సూపర్‌ చిత్రాలు అందించి దర్శకుడిగా నిరూపించుకున్నారు. ఈ పాటతో తనలో నటుడిని పరిచయం చేస్తున్నారు. ప్రేమ అనేది ఒక భ్రమని నా నమ్మకం. ప్రేమలో ఉన్న ఇద్దరి బంధాన్ని నాలుగు నిమిషాల్లో చూపించాలనుకున్నా. భవిష్యత్తులో ఒక బంధం ఎలా ఉండబోతుందో ముందే తెలిస్తే మీరు అందులో ఉంటారా ? లేదా ? అన్న ప్రశ్న పాట రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాము. వేరువేరు ప్రదేశాల్లో మూడు రోజులు షూటింగ్‌ చేశాం.

ఈ పాట కోసం నాన్నతో కలిసి వర్క్‌ చేశాను. మరోసారి ఈ అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. నాన్న గొప్ప రచయిత, నటుడు. ఆయన తన పనిలో ఎంత బిజీగా ఉన్నా ఫోన్‌ చేసి ప్రతీ విషయం తెలుసుకునేవారు. ఆయనలా నేను కష్టపడి పని చేస్తాను. ఒకరిపై ఆధారపడను. గత ఏడాది వచ్చిన విజయాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నా’’ అని శృతిహాసన్‌ వెల్లడించారు. ప్రస్తుతం శృతిహాసన్‌ అడవి శేష్‌ సరసన ‘డకాయిట్‌’లో నటిస్తున్నారు. యాక్షన్‌ డ్రామాగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాకు షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read : Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నుండి విలన్ ఇమ్రాన్ హస్మి ఫస్ట్ లుక్ రిలీజ్ !

Lokesh KanagarajShruti Haasan
Comments (0)
Add Comment