Shriya Saran: రజనీకాంత్‌ సలహానే పాటిస్తున్నానంటున్న శ్రియ !

రజనీకాంత్‌ సలహానే పాటిస్తున్నానంటున్న శ్రియ !

Shriya Saran: సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే ప్రతిభ మాత్రమే కాదు… సరైన గైడెన్స్ కూడా అవసరమే అంటోంది దక్షిణాది భాషల అగ్రతార శ్రియ. అలాంటి గైడెన్స్… సినీ పెద్దల సలహాలతోనే తన సినీ జీవితంలో రాణిస్తున్నానని ఆమె స్పష్టం చేస్తోంది. ఇష్టం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి… అతి తక్కువ కాలంలోనే అగ్రహీరోల సరసన నటించి… తమిళ, హిందీ సినిమా పరిశ్రమలో కూడా తనదైన ముద్రవేసిన ఈ భామ ఇటీవల ‘షో టైమ్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో శ్రియ మాట్లాడుతూ ఆమె ఇప్పటికీ రజనీకాంత్‌ ఇచ్చిన సలహాని ఇప్పటికీ పాటిస్తున్నానంటూ తెలిపింది. దీనితో శ్రియ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Shriya Saran Comment

ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రియ(Shriya Saran) మాట్లాడుతూ… ‘నటిగా నేను చిత్రసీమలో అడుగుపెట్టినప్పుడు ఎన్నో సవాళ్లని ఎదుర్కొన్నాను. ఒకసారి భయపడి షూటింగ్‌ నుంచి కూడా పారిపోయాను. విక్రమ్‌తో ‘కందసామి’ సినిమా చేస్తున్న సమయంలో ఒక్క షాట్‌కి ఎన్నో టేకులు తీసుకునేదాన్ని. విక్రమ్‌ ఓపికగా భరించేవారు. ఆ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. అలా చేస్తే షూటింగ్ పై, సెట్‌ పై ప్రభావం చూపుతుందని నాకు అర్థమయ్యేలా సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన మాట… నన్ను నేను మార్చుకోవడానికి సహాయ పడింది. నేను రజనీకాంత్‌ తో ‘శివాజీ’ చేస్తున్నప్పుడు ఆయన నాకు గొప్ప సలహా ఇచ్చారు. ‘ఈరోజు నువ్వు నీ అందం, అభినయంతో విజయవంతమైన సినిమాలు చేస్తున్నావు. వచ్చే రోజుల్లో పరిస్థితి మారవచ్చు. వైఫల్యాలను ఎదుర్కోవచ్చు. అయినా ప్రేక్షకులతో ప్రేమగా, మర్యాదగా ప్రవర్తించాలి’ అని ఆయన చెప్పిన సలహా ఎంతో ఉపయోగపడింది. ఇప్పటికీ నేనదే పాటిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది శ్రియ.

Also Read : Jayam Ravi: మణిరత్నంకు షాక్ ! భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న స్టార్ హీరో !

Shriya SaranSuper Star Rajanikanth
Comments (0)
Add Comment