Shreya Ghoshal: రూ. 240 కోట్ల ఆస్తులతో ధనిక గాయనిగా శ్రేయా ఘోషల్ !

రూ. 240 కోట్ల ఆస్తులతో ధనిక గాయనిగా శ్రేయా ఘోషల్ !

Shreya Ghoshal: భారతీయ సంగీత ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు శ్రేయా ఘోషల్. ఆశా భోంస్లే, లతామంగేష్కర్ తరువాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన సింగింగ్ సన్సేషన్ శ్రేయా ఘోషల్ మాత్రమే. ఆరేళ్ళ వయసులో సంగీత ప్రపంచంలోనికి అడుగుపెట్టి 16 ఏళ్ళ వయసులోనే కెరీర్ లో ఉత్తమ స్థాయికి చేరుకున్న శ్రేయా… ఇప్పటివరకు 3000కి పైగా పాటలు పాడింది. తెలుగు, తమిళం, మలయాళం, హింది అని తేడా లేకుండా వివిధ భాషల్లోపాటలు పాడుతూ… ప్రస్తుతం క్వీన్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ గా ఉన్న శ్రేయా… ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

Shreya Ghoshal Properties..

రూ. 240 కోట్ల ఆస్తులతో దేశంలోనే ధనిక గాయనిగా శ్రేయా(Shreya Ghoshal) రికార్డుకెక్కింది. శ్రేయా ఘోషల్ నికర ఆస్తి విలువ రూ. 240 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర గాయనీమణుల ఆస్తుల వివరాల్లోకి వెళ్తే… సునిధి చౌహాన్ నికర ఆస్తి విలువ రూ. 100 కోట్లకు పైగా ఉండగా, ఆశా భోంస్లే నికర ఆస్తుల విలువ రూ. 80 కోట్ల, లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ నేహా కక్కర్ ఆస్తి విలువ దాదాపు రూ.40 కోట్లుగా తెలుస్తోంది. రూ. 240 కోట్ల నికర ఆస్తులతో.. రిచెస్ట్ సింగర్ గా శ్రేయా అవతరించినట్లు తెలుస్తోంది. దీనితో శ్రేయా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. తమ అభిమాన గాయని… దేశంలోనే ధనిక గాయనిగా గుర్తింపు పొందడంపై శ్రేయాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

1984లో పశ్చిమ బెంగాల్‌ ముర్షిదాబాద్‌ లోని బెర్హంపూర్‌ లో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శ్రేయా ఘోషల్(Shreya Ghoshal)… తన ఆరేళ్ళ వయసులోనే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది. దివంగత కళ్యాణ్‌జీ భాయ్ వ‌ద్ద‌ 18 నెలల పాటు శిక్షణ పొందింది. ముంబైలోని లేట్ ముక్తా భిడేతో తన శాస్త్రీయ సంగీత శిక్షణను కొనసాగించింది. శ్రేయా రియాలిటీ షో నుండి తన మొదటి బ్రేక్ పొందింది. పదహారేళ్ల వ‌య‌సులో టెలివిజన్ సింగింగ్ రియాలిటీ షో `స రే గామా`లో గెలిచిన తర్వాత ద‌ర్శ‌క‌నిర్మాత సంజయ్ లీలా భ‌న్సాలీ తల్లి దృష్టిలో ప‌డింది. త‌న‌ మొదటి స్టూడియో ఆల్బమ్ `బెంధెచ్చి బీనా` 14 బాణీల‌తో 1998 జనవరిలో విడుదలైంది. శ్రేయా ఘోషల్ 2002లో భ‌న్సాలీ `దేవదాస్` చిత్రంతో పెద్ద బ్రేక్‌ను పొందింది. దాని కోసం ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకుంది.

2017లో ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని భారతీయ విభాగంలో శ్రేయా మైనపు బొమ్మను ప్రదర్శించారు. ఇలాంటి అదృష్టం ద‌క్కించుకున్న‌ మొదటి భారతీయ గాయనిగా శ్రేయా ఘోషల్ రికార్డుకెక్కారు. USలోని ఒహియో రాష్ట్రం కూడా ఈ మేటి ప్ర‌తిభావ‌నిని గౌరవించింది. అక్కడ గవర్నర్ టెడ్ స్ట్రిక్‌ల్యాండ్ 26 జూన్ 2010ని శ్రేయా ఘోషల్ డేగా ప్రకటించారు. ఫోర్బ్స్ విడుదల చేసిన భారతదేశపు టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో శ్రేయా ఐదుసార్లు చోటు దక్కించుకున్నారు.

Also Read : Allu Arjun: ఐకాన్ స్టార్ ను చూసి అభిమాని తీవ్ర భావోద్వేగం !

BollywoodShreya Ghoshal
Comments (0)
Add Comment