Stree 2 : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’

జవాన్ పేరు మీదున్న 580 కోట్ల రికార్డును సైతం తుడిచేసింది ఈ చిత్రం...

Stree 2 : ఇట్స్ అఫీషియల్.. ఇంక అనుమానాలు అక్కర్లేదు.. బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్ ఇకపై జవాన్ కాదు.. ఆల్ టైమ్ రికార్డ్‌కు షారుక్ ఖాన్‌తో ఉన్న బంధం తెగిపోయింది. ఆ ప్లేస్‌లోకి మరో సినిమా వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. అందరి లెక్కలు తేల్చేసింది స్త్రీ 2(Stree 2). మరి ఈ సినిమా రికార్డును క్రాస్ చేసే అవకాశం నియర్ ఫ్యూచర్‌లో ఏ సినిమాకు ఉంది..? బాహుబలి 2 లేదు.. జవాన్ లేదు.. యానిమల్ లేదు.. అందర్నీ ఇంటికి పంపించేసింది స్త్రీ 2. బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలబడింది. 5వ వారంలోనూ స్త్రీ 2 కలెక్షన్స్ మామూలుగా లేవు. కేవలం హిందీలోనే 586 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం.

Stree 2 Movie Updates

జవాన్ పేరు మీదున్న 580 కోట్ల రికార్డును సైతం తుడిచేసింది ఈ చిత్రం. దాంతో నయా రికార్డులు స్త్రీ పేరు మీదకు వచ్చేసాయి. హిందీలో ఇప్పటి వరకు కేవలం 6 సినిమాలు మాత్రమే 500 కోట్లు వసూలు చేసాయి. 2017లో బాహుబలి 2తో తొలిసారి 500 కోట్లు వసూలు చేసారు ప్రభాస్. ఆ తర్వాత గదర్ 2, పఠాన్, జవాన్, యానిమల్ హిందీలో సోలోగా 500 కోట్లు వసూలు చేసాయి. మళ్ళీ ఇందులో యానిమల్, జవాన్ మాత్రమే 550 కోట్లు దాటాయి. ఇప్పుడు స్త్రీ 2 అడుగులు 600 కోట్ల వైపు పడుతున్నాయి. సెప్టెంబర్ 27న దేవర వచ్చే వరకు పెద్ద సినిమాలేం లేవు.

దాంతో కచ్చితంగా స్త్రీ 2 కలెక్షన్స్ 600 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ రికార్డ్ క్రాస్ చేసే అవకాశం పుష్ప 2కు మాత్రమే ఉందనేది ట్రేడ్ చెప్తున్న మాట. ఆ స్థాయి అంచనాలు దీనిపైనే ఉన్నాయి. డిసెంబర్ 6న పుష్ప 2 రానుంది. ఇది హిట్టైతే.. 600 కోట్లు పుష్ప 2కు పెద్ద కష్టమేం కాకపోవచ్చు.

Also Read : Laa Pataa Ladies : ఆస్కార్ రేసులో అమీర్ ఖాన్ భార్య నిర్మించిన ‘లపతా లేడీస్’

CinemaShraddha Kapoorstree 2TrendingUpdatesViral
Comments (0)
Add Comment