Shraddha Kapoor: బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్… రైటర్ రాహుల్ మోదీతో డేటింగ్‌లో ఉన్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పెట్టిన ఓ పోస్ట్… ఇప్పుడు బీటౌన్ లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రద్ధ… తాజాగా రాహుల్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అతడి చేతిని పట్టుకొని నవ్వుతూ కనిపించారు. ‘నా మనసును తీసుకెళ్లు… కానీ నా నిద్రను తిరిగిచేయ్’ అనే క్యాప్షన్ పెట్టారు. నవ్వుతున్న ఎమోజీలతో పాటు హార్ట్ సింబల్ ను జోడించారు. దీనితో ఆమె అధికారికంగా తన రిలేషన్ ను చెప్పేశారని అభిమానులు అంటున్నారు. కొందరు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఆ పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు.
Shraddha Kapoor Respond
గతేడాది వచ్చిన ‘తు ఝూతి మైన్ మక్కార్’ సమయంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉంటున్నట్లు వార్తలు ప్రారంభమయ్యాయి. ఆ సినిమాకు రాహుల్ రైటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో జరిగే ఈవెంట్లకు, పార్టీలకు ఇద్దరూ కలిసి హాజరుకావడంలో అవి జోరందుకున్నాయి. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లోనూ ఈ జంట తళుక్కున మెరిసింది. ఇటీవల ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌లో ‘ఆర్’ అనే అక్షరం ఉన్న లాకెట్‌ను వేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Also Read : Priyanka Chopra: హాలీవుడ్ సినిమా సెట్ లో ప్రమాదం ! ప్రియాంక చోప్రాకు గాయాలు !