Shraddha Kapoor : బ్రేకప్ బాటలో మరో బాలీవుడ్ భామ ‘శ్రద్ధా కపూర్’

అయితే ఇప్పుడు శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీ విడిపోయారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది...

Shraddha Kapoor : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగానటించిన సాహో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ఈ చిన్నది. ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో మెరవలేదు. అయితే ఈ అమ్మడు బాలీవుడ్ లో మాత్రం బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ‘స్త్రీ 2’ సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. శ్రద్ధా కపూర్ సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగత కారణాలతో కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. సినీ పరిశ్రమలో కో-డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ జంట చాలా రోజులు సీక్రెట్ గా ఉంచారు. కానీ ఎక్కువ కాలం దాచలేకపోయారు.

అయితే ఇప్పుడు శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీ విడిపోయారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. దీనిపై వారు బయటకు అనౌన్స్ చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆధారాలు ఉన్నాయి. శ్రద్ధా కపూర్(Shraddha Kapoor), రాహుల్ మోడీ 2023లో చాలా సన్నిహితంగా ఉన్నారు. శ్రద్ధా కపూర్ తమ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చూసిన అభిమానులకు ఓ క్లారిటీవచ్చింది. అలాగే కొన్ని సందర్భాల్లో, శ్రద్ధా కపూర్ రాహుల్ మోడీతో కనిపించింది. అయితే ఇప్పుడు వీరి రిలేషన్‌షిప్‌లో బ్రేక్ అయినట్టు బాలీవుడ్ లో వార్తలు గుప్పుమన్నాయి.

Shraddha Kapoor…

సెలబ్రిటీల ప్రతి కదలికను అభిమానులు ఎప్పుడూ గమనిస్తుంటారు. శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ మోడీని అన్ ఫాలో చేసింది. అలాగే, రాహుల్ మోడీ ప్రొడక్షన్ హౌస్, ఆత్మీయూర్, ముద్దీన్ శ్వందా పేజీలను శ్రద్ధా కపూర్ అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. బ్రేకప్ వల్లే ఇలా చేశారన్నది నెటిజన్ల వాదన. త్వరలోనే దీని పై క్లారిటీ వస్తుందేమో చూడాలి. శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఓ హారర్ కథతో తెరకెక్కింది. రాజ్‌కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, తమన్నా భాటియా వంటి ప్రముఖ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు క్రేజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది.

Also Read : Super Deluxe : కోలీవుడ్ అగ్ర నటులు, నటీమణుల మాస్టర్ పీస్ సినిమా తెలుగులో..

BreakingLove BreakupShraddha KapoorUpdatesViral
Comments (0)
Add Comment