Kanguva Updates : సూర్య ‘కంగువ’ సినిమాలో శ్రద్ధాదాస్ కూడా నటిస్తుందా..?

యూట్యూబ్‌లో ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సాధించింది...

Kanguva : బ్యూటీ శ్రద్ధా దాస్ కూడా ‘కంగువా’కు పని చేశారు. కాకపోతే ఆమె పని చేసింది నటిగా కాదు. ప్లేబ్యాక్ సింగర్‌గా. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. గ్లామర్ తారగా శ్రద్ధా దాస్‌(Shraddha Das)కి మంచి పేరు ఉంది. అయితే ఆమె గ్లామర్, ఆమెకు అవకాశాలు అంతగా రప్పించలేకపోతోంది. అందుకే సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ హాట్‌గా కనిపిస్తూ, కవ్విస్తుంటుంది. ఇక ఇప్పుడామె సూర్య ‘కంగువా’ కోసం ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్‌గా మారిపోయారు. ‘కంగువా’ సినిమాతో శ్రద్ధా దాస్‌‌ని సింగర్‌గా ప్రేక్షకులకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ పరిచయం చేస్తున్నారు. సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’లో శ్రద్దా దాస్ ఓ పెప్పీ సాంగ్‌ను ఆలపించారు. ఈ సాంగ్‌ని రీసెంట్‌గా మేకర్స్ వదిలారు.

Kanguva Movie Actress..

సూర్య,దిశా పటాని, బాబీ డియోల్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ‘కంగువా’ చిత్రం నవంబర్ 14న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘కంగువా’ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ‘ఏలో’ పాట అందరినీ అలరించింది. యూట్యూబ్‌లో ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సాధించింది. దేవి శ్రీ ప్రసాద్, శ్రద్ధా దాస్, సాగర్ సంయుక్తంగా ఆలపించిన ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించారు.

‘ఏలో’అంటూ సాగిన ఈ పాటలోని శ్రద్ధా దాస్ గాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక ప్రొఫెషనల్ సింగర్ వాయిస్‌లా ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అలాగే, ఇటీవల హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన మ్యూజికల్ ఈవెంట్‌లో రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి శ్రద్ధాదాస్ పాటలను పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. చూస్తుంటే ముందు ముందు శ్రద్ధా దాస్ సింగర్‌గానూ బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రద్ధా దాస్ పాడిన పాట ఎలా ఉందో మీరు వినేయండి.

Also Read : Jr NTR : నెక్స్ట్ ఆ డైరెక్టర్ తో ప్రాజెక్ట్ కు సిద్ధమవుతున్న జూనియర్ ఎన్టీఆర్

CinemaKanguvaShraddha DasTrendingUpdatesViral
Comments (0)
Add Comment