Shoaib Malik: పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్ మన్, హైదరాబాదీ టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్(Shoaib Malik) ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నారు. పాక్ నటి సనా జావెద్ ను ఈ ఏడాది జనవరిలో పెళ్లాడారు. 2010లో సానియా మీర్జాను రెండో పెళ్లి చేసుకున్న షోయబ్… గతేడాది ఆమెతో విడిపోయారు. ఇటీవలే సనా జావెద్ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
Shoaib Malik Marriages..
అయితే అంతలోనే షోయబ్ మరో నటి వెంట పడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కు చెందిన మరో స్టార్ నటి నవల్ సయీద్ ఇటివలే లైఫ్ గ్రీన్ హై అనే ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తనకు పాకిస్థానీ క్రికెటర్ల నుంచి మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపింది. పెళ్లయిన క్రికెటర్ల నుంచి కూడా మేసేజేస్ వస్తున్నాయని చెప్పడంతో పరోక్షంగా షోయబ్ మాలిక్ గురించి ఆమె ప్రస్తావించినట్లు నెటిజన్స్ భావిస్తున్నారు. మీరు షోయబ్ మాలిక్ గురించే మాట్లాడుతున్నారా అని హోస్ట్ ప్రశ్నించగా… ఆమె నవ్వుతూ అతని పేరు మరచిపోయినట్లు చెప్పడం గమనార్హం. దీనితో మూడో పెళ్లై మూడు నెలలు తిరగకముందే షోయబ్ మాలిక్ మరో పెళ్ళికి సిద్ధమైపోతున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతన్నారు.
అయితే ఆ క్రికెటర్లు ఎలాంటి మెసేజ్‌లు పంపిస్తున్నారు అని అడగ‍్గా…’ తాను వాటి గురించి చెప్పదలచుకోలేదని స్పష్టం చేసింది. అయితే క్రికెటర్లు అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. యాక్టర్స్ కంటే ఎక్కువగా క్రికెటర్లు, క్రీడాకారులనే చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారని” నవల్ సయీద్ చెప్పుకొచ్చింది.
Also Read : Hero Nani : హీరో నానికి ఆర్ఆర్ఆర్ నిర్మాత అంత రెమ్యూనరేషన్ ఇచ్చారా…!