Shivangi Verma : 70 ఏళ్ల నటుడితో ప్రేమలో పడ్డ 31 ఏళ్ల బాలీవుడ్ నటి

31ఏళ్ల నటి శివంగి వర్మ ప్రముఖ నటుడు గోవింద్ నామ్‌దేవ్‌తో ఫోటోను పంచుకుంది...

Shivangi Verma : ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. ప్రేమకు అందంతో పనిలేదు. మనసు ముఖ్యం.. ఇలాంటి డైలాగ్స్ ఎక్కువగా బిగ్ స్క్రీన్ పై చూస్తుంటాం. కానీ రియల్ లైఫ్ లోనూ ఇదే నిజమంటుంది ఓ హీరోయిన్. తన ప్రేమకు వయసుతో అసలు సంబంధం లేదంటోంది. దీంతో ఆ నటి ప్రేమాయణంపై నెటిజన్స్ విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్ చూసి అవాక్కవుతున్నారు. 70 ఏళ్ల నటుడితో 31 ఏళ్ల బ్యూటి ప్రేమలో పడిందంటూ షాకవుతున్నారు. 70 ఏళ్ల సీనియర్ నటుడితో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ అతడిపై తన ప్రేమను బయటపెట్టింది. దీంతో ఇప్పుడు ఆ నటిని ట్రోల్ చేస్తున్నారు.

Shivangi Verma Post Viral

31ఏళ్ల నటి శివంగి వర్మ(Shivangi Verma) ప్రముఖ నటుడు గోవింద్ నామ్‌దేవ్‌తో ఫోటోను పంచుకుంది. ఆ ఫోటోను షేర్ చేస్తూ “ప్రేమకు వయసు, పరిమితులు లేవు” అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేయడంలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. డబ్బు ముఖ్యం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా.. ?.. డబ్బు ఉంటే వయసు, పరిమితి లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే మరోవైపు శివంగి పోస్ట్ కేవలం పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. నిజానికి వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుందని.. ఈ క్రమంలోనే షూటింగ్ సెట్ లో సరదాగా ఉన్న ఫోటో షేర్ చేసిందని అంటున్నారు. తనపై వస్తోన్న ట్రోలింగ్ పై శివంగి, గోవింద్ నామ్ దేవ్ స్పందించలేదు. గోవింద్ నామ్‌దేవ్ అనేక చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు. ‘బ్యాండిట్ క్వీన్’, ‘సర్ఫరోష్’, ‘సత్య’ వంటి సినిమాలతో ఫేమస్ అయ్యాడు.

Also Read : Actress Kasthuri : ఇళయరాజాకు అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలపై స్పందించిన నటి

Insta PostShivangi VermaUpdatesViral
Comments (0)
Add Comment