Hero Shiva Rajkumar :క్యాన్స‌ర్ పై హీరో శివ‌న్న అవ‌గాహ‌న

త్వ‌ర‌లో డాక్యుమెంట‌రీ విడుద‌ల

Shiva Rajkumar : క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ రాజ్ కుమార్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌న‌కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంత ఉన్న‌త స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ త‌న‌తో పాటు ఫ్యామిలీ మొత్తం సింపుల్ గా ఉండేందుకు ఇష్ట ప‌డుతుంది. ఎక్క‌డా హంగు ఆర్భాటం అన్న‌ది లేకుండా ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తారు. తాజాగా త‌ను దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు. దీనికి కార‌ణంగా ఆయ‌న గ‌త కొంత కాలంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అత్యంత భ‌యంక‌ర‌మైన క్యాన్సర్ వ్యాధికి లోన‌య్యారు.

Shiva Rajkumar Comment

ఆరు నెల‌ల‌కు పైగా ఆయ‌న సీరియ‌స్ గా చికిత్స తీసుకున్నారు. అమెరికాలోని అత్యున్న‌త చికిత్స అనంత‌రం కోలుకున్నారు. త‌ను ప్ర‌స్తుతం మెగాస్టార్ త‌న‌యుడు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ , జాన్వీ క‌పూర్ తో క‌లిసి తీస్తున్న ఆర్సీ 16 సినిమాలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నారు. దీనికి ఇంకా పేరు ఖ‌రారు చేయ‌లేదు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్, వీడియోను షేర్ చేశారు మూవీ మేక‌ర్స్.

ఇదిలా ఉండ‌గా క‌న్న‌డ స్టార్ శివ రాజ్ కుమార్(Shiva Rajkumar) అలియాస్ శివ‌న్న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. చాలా మంది క్యాన్స‌ర్ భూతానికి గుర‌వుతున్నారు. ఆ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. వ‌చ్చిన త‌ర్వాత ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నే దానిపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్బంగా క్యాన్స‌ర్ పై ప్ర‌జ‌ల‌లో చైత‌న్య‌వంతం చేసేందుకు గాను ఓ డాక్యుమెంట‌రీని తీసుకు వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాజాగా శివ‌న్న చేసిన ప్ర‌క‌ట‌నతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేశారు. ఆయ‌న నిర్ణ‌యం గొప్ప‌దంటూ కితాబు ఇస్తున్నారు.

Also Read : Beauty Janhvi Kapoor Poster :బ‌ర్త్ డే గిఫ్ట్ జాన్వీ క‌పూర్ పోస్ట‌ర్ రిలీజ్

AwarenessCancerCommentsShiva RajkumarViral
Comments (0)
Add Comment