Shiva Nirvana : రచయిత, దర్శకుడు శివ నిర్వాణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను రాసి, దర్శకత్వం వహించిన ఖుషీ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఖుషీ చిత్రాన్ని విడుదల చేశారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు నటించారు.
Shiva Nirvana Kushi Celebrations
విడుదలైన నాటి నుంచి నేటి దాకా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఖుషీ. ఈ సందర్భంగా హైదరాబాద్ లో భారీ ఎత్తున మూవీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ చేపట్టారు. నటుడు విజయ్ దేవరకొండ కేక్ కట్ చేశారు. తనను నమ్మి ఛాన్స్ ఇచ్చినందుకు మైత్రీ సంస్థ నిర్మాతలకు , నటుడికి థ్యాంక్స్ తెలిపారు దర్శకుడు శివ నిర్వాణ.
చాలా మంది తమ ఖుషీ గురించి వ్యతిరేకంగా ప్రచారం చేశారని కానీ ఎక్కడా ఆప లేక పోయారని అన్నారు. ఖుషీ ఊహించని సక్సెస్ అందుకుందన్నారు శివ నిర్వాణ(Shiva Nirvana). సినిమా పరంగా తమకు భారీ అంచనాలు ఉన్నాయని , అభిమానులు దానిని నిజం చేసి చూపించారని కొనియాడారు దర్శకుడు.
కథలో దమ్ముంటే సినిమా అన్నది విజయం సాధిస్తుందని ఖుషీ విజయంతో రూఢీ అయ్యిందని అన్నారు శివ నిర్వాణ. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరుకునేందుకు పరుగులు తీస్తోంది. మొత్తం రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఇది ఊహించని గిఫ్ట్ .
Also Read : Vijay Devarakonda : కోటి రూపాయల విరాళం – విజయ్