Shiva Kumar : తన కుమారుడు, హీరో సూర్య సినీ కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమాగా ‘కంగువా’ ఉంటుందని ‘కోలీవుడ్ మార్కండేయగా’ గుర్తింపు పొందిన సీనియర్ నటుడు, సూర్య(Suriya) తండ్రి శివకుమార్(Shiva Kumar) కితాబిచ్చారు. సిరుత్తై శివ దర్శకత్వంలో సూర్య – దిశా పటానీ జంటగా నటించిన చిత్రం ‘కంగువా(Kanguva)’ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సహా పదికిపైగా భాషల్లో తెరకెక్కింది. స్టూడియో గ్రీన్ పతాకంపై బడా నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడు. నవంబరు 14వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
Shiva Kumar Comment
ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు చిత్ర బృందంతో పాటు శివకుమార్(Shiva Kumar), కేఎస్ రవికుమార్, ఏఎల్ విజయ్, ఆర్‌జే బాలాజీ, కార్తీక్ సుబ్బరాజ్, శక్తివేల్, ధనుంజయన్, హీరో కార్తీ, ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు, నటులు నట్టికుమార్, బోస్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. ‘నలుగురు మధ్య మాట్లాడేందుకు ఎంతో సిగ్గు, బెరుకుతో వణికిపోయే మా కుట్టిపయ్య (చిన్నోడు) ఇపుడు ‘కంగువా’ చిత్రంలో నటించాడు. కెరీర్ ఆరంభానికి ముందుకు కుటుంబ పోషణ కోసం అనేక పనులు చేశారు. అనేక మంది అనేక మాటలు అన్నారు. వాటినన్నింటినీ దిగమింగి, అంకితభావంతో ఈ స్థాయికి చేరుకున్నాడు. రెండు దశాబ్దాల సూర్య సినీ కెరీర్‌లో ‘కంగువా’ ది బెస్ట్ మూవీగా ఉంటుంది’ అన్నారు.
హీరో కార్తీ మాట్లాడుతూ.. ‘అభిమానులను సంతృప్తి పరిచేందుకు అన్న సూర్య చాలా శ్రమిస్తారు. ఆయన ఈ స్థాయికి చేరుకోవడం కారణం ఆయన అంకితభావమే అన్నారు. దర్శకుడు సిరుత్తై శివ మాట్లాడుతూ, ‘లొకేషన్‌లో నేను ప్రశాతంగా, ఆత్మవిశ్వాసం, నిగ్రహం, ధైర్యంతో ఉంటానని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. దీనికి కారణం అగ్రహీరో అజిత్ కుమార్. ఆయనతో పనిచేసిన సమయంలో నన్ను అర్థం చేసుకుని ప్రోత్సహించిన తీరే నన్ను ఇలా నిలబెట్టింది. ఆ తర్వాత నా వద్ద పనిచేసే నలుగురు అసిస్టెంట్ దర్శకులు. ఆ నలుగురే 15 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు చేసే పనిని రేయింబవుళ్ళు శ్రమించి చేస్తారు. ఈ చిత్రం ఇంత గ్రాండ్‌గా వచ్చిందంటే దానికి కారణం ఆ నలుగురు అసిస్టెంట్ డైరెక్టర్లే.
ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి ప్రధాన కారణం నా స్నేహితుడు ఆదినారాయణ. రెండోది చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా. భారీ బడ్జెట్, పీరియాడిక్ చిత్రమైనా ఏమాత్రం వెనుకంజ వేయలేదు. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా సిరుత్తై సినిమా తెరకెక్కించాను. అప్పటి నుంచి నా పేరు సిరుత్తై శివగా మారిపోయింది. ‘ కంగువా’ తర్వాత మరో కొన్నేళ్ళ వరకు నా పేరు ఇండస్ట్రీలో నిలబడిపోతుందన్నారు. హీరో సూర్య మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలో విలన్‌గా బాబీ డియోల్ నటించడం మరిచిపోలేనిది. గొప్ప నటుడైనప్పటికీ ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అన్నారు. ఈ సందర్భంగా దేవీశ్రీ ప్రసాద్ ఆలపించిన పాట అభిమానులతో పాటు అహుతులను ఆలరించింది.
Also Read : ANR Awards : మెగాస్టార్ చిరంజీవికి ‘ఏఎన్ఆర్’ జాతీయ అవార్డును అందించిన అమితా బచ్చన్
Shiva Kumar : ఒకప్పుడు సిగ్గుతో వణికిపోయే సూర్య ఇప్పుడు ‘కంగువా’ సినిమా చేసాడు
హీరో కార్తీ మాట్లాడుతూ.. ‘అభిమానులను సంతృప్తి పరిచేందుకు అన్న సూర్య చాలా శ్రమిస్తారు...