Shine Tom Chacko : ‘దసరా’ ఫేమ్ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇప్పుడు తెలుగు సినిమాల్లో వరుసగా నటిస్తూ ఉన్నాడు. దసరాలో విలన్ పాత్రలో మెప్పించిన తర్వాత ‘రంగబలి’లోనూ విలన్‌గా నటించాడు. ప్రస్తుతం ‘దేవర’లోనూ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రేమ, రిలేషన్‌షిప్ విషయాలతో మళయాళ మీడియాలో వార్తల్లో నిలుస్తున్నాడు షైన్ టామ్ చాకో. ఈ ఏడాది జనవరిలో తనూజ అనే అమ్మాయితో ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించాడు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
తమ ఎంగేజ్‌మెంట్ ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. త్వరలో పెళ్లి తేదీని ప్రకటిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో షాకింగ్ న్యూస్ చెప్పాడు టామ్ చాకో(Shine Tom Chacko). తనూజాతో తన సంబంధం పెళ్లి కాకుండానే ముగిసిందని వెల్లడించాడు. తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తనూజాతో కలిసున్న ఫొటోలను తొలగించాడు. ఇక తాను అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఎడిహెచ్డి)తో బాధపడుతున్నట్లు ఇది ఉన్న వ్యక్తులు తరచుగా ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు.” అని తెలిపారు. ఎడిహెచ్ డి ఉన్న ఎవరైనా.. తమను చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు గుర్తించాలని కోరుకుంటారని.. ఇతర నటుల నుండి ప్రత్యేకంగా నిలబడటానికి ప్రయత్నిస్తారని తెలిపారు.
Shine Tom Chacko Health Updates
అంతేకాకుండా ప్రేక్షకుల దృష్టి తమపై ఉండేలా కోరుతూ.. పాత్రకు అనుగుణంగా ప్రదర్శన చేస్తారని తెలిపారు. బయటి వ్యక్తులు దీనిని ఒక రుగ్మతగా భావిస్తారని.. తనకు మాత్రం ఎడి హెచ్ డి ఒక క్వాలిటీ లాంటిదని షైన్ టామ్ చాకో తెలిపాడు.
Also Read : Director Harish Shankar : త్వరలో ముల్టీస్టారర్ వస్తానంటున్న హరీష్ శంకర్