Shine Tom Chacko: ‘దసరా’ విలన్‌ కు నిశ్చితార్ధం !

‘దసరా’ విలన్‌ కు నిశ్చితార్ధం !

Shine Tom Chacko: కోవిడ్-19 పాండమిక్ లో వెబ్ సిరీస్ ల పుణ్యమా అంటూ పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో. ‘దసరా’ సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమాలో… ‘బీస్ట్‌’ సినిమాతో డైరెక్ట్ తమిళ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన షైన్‌ టామ్‌ చాకో కొత్త సంవత్సరంలో తన అభిమానులకు శుభవార్త చెప్పారు. ఎంతోకాలంగా తన ప్రేమ,పెళ్ళిపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ తాను నిశ్చితార్ధం చేసుకున్న అమ్మాయి వివరాలు బయటపెట్టారు టామ్(Shine Tom Chacko). తాను వ్యక్తిగతంగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని తెలియజేస్తూ… తన స్నేహితురాలు, మోడల్ తనూజతో తనకు నిశ్చితార్ధమైందని ప్రకటించారు. అంతేకాదు వారి నిశ్చితార్ధం ఫోటోలను సోషల్ మీడియా వేదిగా పోస్ట్ చేసారు. దీనితో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, ఫ్యాన్స్‌ షైన్‌ టామ్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

Shine Tom Chacko Engagement

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మలయాళం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టామ్‌ 2011లో నటుడిగా మారారు. పలు చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మలయాళ ప్రేక్షకులను అలరించారు. కోవిడ్-19 పాండమిక్ సమయంలో మలయాళ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఆదరణ ఎక్కువ లభించడంతో ప్రముఖ నటుడు పహాద్ ఫాసిల్ లాగే టామ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందాడు. ఈ నేపధ్యంలోనే టామ్ …. విజయ్ ‘బీస్ట్‌’తో కోలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తరువాత నాని ‘దసరా’, నాగశౌర్య ‘రంగబలి’ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం… టామ్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘దేవర’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Also Read : Venkatesh Saindhav: ఆకట్టుకుంటోన్న ‘సైంధవ్‌’ ట్రైలర్ !

Shine Tom Chacko
Comments (0)
Add Comment