Shilpa Shetty : శిల్పాతో మాస్ మ‌హ‌రాజా స్టెప్టులు

ఏక్ ద‌మ్ ఏక్ ద‌మ్ పాట‌కు డ్యాన్స్

టాలీవుడ్ హీరో మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారారు. కార‌ణం ఆయ‌న ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టితో క‌లిసి డ్యాన్సు చేయ‌డం. ఇందుకు సంబంధించి ఆలియా భ‌ట్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది.

తాజాగా త‌ను న‌టించిన టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు సినిమా ఈ నెల ద‌స‌రా పండుగ‌కు రిలీజ్ కానుంది. ఇందులో నుపుర్ స‌న‌న్ న‌టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పాట ఏక్ ద‌మ్ ఏక్ ద‌మ్ దుమ్ము రేపుతోంది. విడుద‌లైన ఈ సాంగ్ మ్యూజిక్ చార్ట్ లో టాప్ లో కొన‌సాగుతోంది.

ఇప్ప‌టికే మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టే ర‌వితేజ ఉన్న‌ట్టుండి మంచి ఛాన్స్ రావ‌డంతో ఏకంగా శిల్పా శెట్టితో డ్యాన్సుతో హోరెత్తించాడు. మాస్ స్టెప్టుల‌కు తోడుగా త‌ను కూడా పోటీ చేసింది. న‌టించేందుకు ఏజ్ ముఖ్యం కాద‌ని ఇద్ద‌రూ నిరూపించారు .

ర‌వితేజ మొద‌ట అసిస్టెంట్ గా చేరాడు. ఆ త‌ర్వాత న‌టుడిగా స్థిర‌ప‌డ్డాడు. ఆపై టాప్ హీరోలలో కొన‌సాగుతున్నాడు. మినిమం గ్యారెంటీ ఉన్న యాక్ట‌ర్ గా పేరు పొందాడు. మ‌రో వైపు కుంద్రాను పెళ్లి చేసుకుని స్థిర ప‌డిన శిల్పా శెట్టి ప్ర‌స్తుతం బుల్లి తెర‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. వెబ్ స్టోరీస్ పై ఫోక‌స్ పెట్టింది ఈ ముద్గుగుమ్మ‌.

Comments (0)
Add Comment