Shilpa Shetty : గణపతి బప్పా అంటూ తీన్మార్ డాన్స్ చేసిన నటి శిల్పా శెట్టి

అత్యంత భక్తి, ప్రేమతో నిండి ఉన్నాం...

Shilpa Shetty : దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ఆకృతుల్లోని గణపతి విగ్రహాలు మండపాల్లో పూజలందుకుంటున్నాయి. ఇక చాలా చోట్ల గణేశుడి విగ్రహాలు నిమజ్ఞనానికి తరలిపోతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు గణేశుడి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పా శెట్టి కూడా వినాయక చవితి పండుగను ఉత్సాహంగా జరుపుకుంది. భర్త రాజ్ కుంద్రా, పిల్లలతో కలిసి గణపతి నిమజ్ఞన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా తన ముద్దుల తనయ సమీషాతో కలిసి డ్యాన్స్ చేసింది శిల్పాశెట్టి(Shilpa Shetty). ఓవైపు డ్రమ్స్ వాయిస్తూనే మరోవైపు కూతురితో కలిసి ఎంతో ఎనర్జిటిక్ గా నృత్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది. అంతకు ముందు గణపతి దేవుడిని ఇంటికి సాదరంగా ఆహ్వానించి, భక్తిశ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు శిల్పాశెట్టి దంపతులు. ఆ తర్వాత సాంప్రదాయ బద్ధంగా నిమజ్ఞనం పూజలు నిర్వహించి వినాయకుడికి వీడ్కోలు పలికారు.

Shilpa Shetty Dance..

గణేశుడి నిమజ్ఞనం వేడుకల్లో శిల్పా శెట్టి(Shilpa Shetty)తో పాటు ఆమె భర్త రాజ్ కుంద్రా, పిల్లలు వియాన్, సమీషా, సోదరి షమితా శెట్టి, తల్లి సునంద కూడా భాగమయ్యారు. అందరూ తమ ఇష్ట దైవానికి హారతి ఇచ్చి, గణపతిబప్పా మోరియా అంటూ ఆనందోత్సాహాల మధ్య గణేశుడికి వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది శిల్పా. ‘ మా గన్ను రాజాకు వీడ్కోలు చెప్పడం అంత సులభం కాదు. అత్యంత భక్తి, ప్రేమతో నిండి ఉన్నాం. కానీ భారమైన బాధా తప్త హృదయాలతో వీడ్కోలు పలుకుతున్నాం, వచ్చే ఏడాది మిమ్మల్ని స్వాగతించేందుకు ఎదురు చూస్తూ ఉంటాను’ అంటూ రాసుకొచ్చింది శిల్పా. ప్రస్తుతం ఈ వీడియో గణపతి భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. శిల్పాశెట్టి ఘనంగా నిర్వహించిన గణపతి వేడుకలకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్,ఆమె భర్త జాకీ భగ్నానీ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి గణేశుడి నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్నారు.

Also Read : Chitra Shukla : తల్లి కాబోతున్న ప్రముఖ టాలీవుడ్ నటి చిత్ర శుక్ల

DanceShilpa ShettyTrendingUpdatesViral
Comments (0)
Add Comment