Shilpa Shetty : సినీవాలిలో 30 ఏళ్లు – శిల్పా శెట్టి

గ‌తంలో జీవించ‌న‌న్న న‌టి

Shilpa Shetty : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌ను చిత్ర రంగంలోకి ప్ర‌వేశించి 30 ఏళ్లు కావస్తోంది. దీనిపై ఆమె స్పందించారు. త‌న అనుభూతిని పంచుకున్నారు. జీవితం ప‌ట్ల అవ‌గాహ‌న ఉంది. అనుకోకుండా న‌టిని అయ్యాను. ఆ త‌ర్వాత ఊహించ‌ని స్టార్ డ‌మ్ వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నా.

Shilpa Shetty as a Actor

ఒక ర‌కంగా కుటుంబ ప‌రంగా నాకు స‌పోర్ట్ ద‌క్కింది. దీని వ‌ల్ల‌నే నేను ఇలా ఉండ‌గ‌లిగాన‌ని పేర్కొంది న‌టి శిల్పా శెట్టి(Shilpa Shetty). సినీ రంగంలో టాప్ మంది మంది న‌టుల‌తో క‌లిసి ప‌ని చేసే అదృష్టం త‌న‌కు క‌లిగింద‌న్నారు. ఎవ‌రి ప‌ట్ట త‌న‌కు కోపం లేద‌న్నారు. వెన‌క్కి తిరిగి చూసుకుంటే అప్పుడే ముప్పై ఏళ్లు గ‌డిచి పోయాయా అన్న ఆశ్చ‌ర్యం క‌లిగింద‌ని చెప్పింది శిల్పా శెట్టి.

ఏదీ మ‌న చేతుల్లో ఉండ‌దు. అందుకే గ‌తాన్ని తాను ప‌ట్టించు కోన‌ని స్ప‌ష్టం చేసింది. కేవ‌లం వ‌ర్త‌మానంలో జీవిస్తాన‌ని, భ‌విష్య‌త్తు గురించి కూడా తాను ప‌ట్టించుకోన‌ని చెప్పింది శిల్పా షెట్టి. సినిమాలలో న‌టించ‌డం ల‌క్. ఇప్పుడు బుల్లి తెర‌పై కూడా పార్టిసిపేట్ చేయ‌డం మ‌రింత సంతోషం క‌లిగిస్తోంద‌ని పేర్కొంది ఈ బాలీవుడ్ న‌టి. యోగా, ధ్యానం, సానుకూల ఆలోచ‌న ఇవి త‌న‌ను మ‌రింత బాగా ఉండేలా చూశాయ‌ని చెప్పింది.

Also Read : Jailer OTT Release : ఓటీటీలో ర‌జ‌నీకాంత్ జైల‌ర్

Comments (0)
Add Comment