Sherlyn Chopra Shocking :ప్రియాంకా ఛాన్స్ లు లేవంటే ఎలా..?

నిప్పులు చెరిగిన షెర్లిన్ చోప్రా

Sherlyn Chopra : బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో స్థిర‌ప‌డిన న‌టి ప్రియాంక చోప్రా ఈ మ‌ధ్య‌న త‌న‌కు ఆశించినంత‌గా సినిమా ఛాన్స్ లు రావ‌డం లేదంటూ వాపోయింది. ఆమె చేసిన కామెంట్స్ పై ప‌లువురు పెద‌వి విరిచారు. త‌న‌కంటే చిన్నవాడిని క‌ట్టుకుని బాగానే వెన‌కేసుకుంది. బాలీవుడ్ లో ప్ర‌ముఖ న‌టులంద‌రితో త‌ను న‌టించింది. భారీ ఎత్తున పారితోష‌కం కూడా అందుకుంది.

Sherlyn Chopra Shocking Comments..

ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రో వైపు వెబ్ సీరీస్ , సీరియ‌ల్స్ లో న‌టిస్తోంది హాలీవుడ్ లో. త‌న‌తో పాటు దీపికా ప‌దుకొనే కూడా అమెరికాలోని ఓ సీరిస్ లో క‌నిపించింది. ఇదే షారుక్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్ , హృతిక్ రోష‌న్ లాంటి టాప్ న‌టుల‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతే కాదు పెద్ద ఎత్తున యాడ్స్ ల‌లో పాలు పంచుకుంటోంది.

న‌టిగా, మోడ‌ల్ గా చేతి నిండా సంపాదిస్తున్నా ఇంకా ఎందుకు ఛాన్స్ లు రాలేదంటూ చెప్ప‌డం అంటూ తీవ్రంగా మండిప‌డింది బాలీవుడ్ న‌టి షెర్లిన్ చోప్రా. ఇది మంచి ప‌ద్ద‌తి కాదంటూ హిత‌వు ప‌లికింది. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం అమెరికా నుంచి ప్రియాంక చోప్రా హైద‌రాబాద్ లో అడుగు పెట్టింది.

త‌ను దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఇంట‌ర్నేష‌న‌ల్ అడ్వెంచ‌ర్ మూవీ ఎస్ఎస్ఎంబీ29 మూవీకి ఎంపికైంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం స్టూడియోలో ప్ర‌త్యేకంగా త‌యారు చేసిన సెట్స్ లో పాల్గొంటోంది. ఈ మ‌ధ్య‌నే త‌ను న‌టిస్తున్న‌ట్లు క్లూ ఇచ్చారు మూవీ మేక‌ర్స్. ప్రియాంక చోప్రా ఆమ‌ధ్య‌న రామ్ చ‌ర‌ణ్ తో న‌టించింది. చాలా గ్యాప్ త‌ర్వాత ప్రిన్స్ మ‌హేష్ బాబుతో న‌టించ‌నుంది.

మొత్తంగా ష‌ర్లిన్ చోప్రా(Sherlyn Chopra) తాజాగా ప్రియాంక చోప్రా నుంచి ఉద్దేశించిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మార‌డం విశేషం.

Also Read : Beauty Nabha Natesh :న‌భా నటాష్ అందాల ఆర‌బోత

CommentsPriyanka ChopraViral
Comments (0)
Add Comment