Sheraz Mehdi : తమిళ సినీ రంగంలో షెరాజ్ మెహదీ(Sheraz Mehdi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి న పనిలేదు. తను హీరోనే కాదు దర్శకుడు, సంగీత దర్శకుడు, కథలు కూడా రాస్తాడు. తను చెప్పాలని అనుకున్నది చెప్పేంత దాకా నిద్రపోడు. తెరపై డిఫరెంట్ గా ప్రజెంట్ చేయాలని తపిస్తాడు. తాజాగా తను దర్శకత్వం, నటించిన చిత్రం ఓ అందాల రాక్షసి(O Andala Rakshashi). ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మొత్తంగా చూస్తే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.
Sheraz Mehdi ‘O Andala Rakshashi’ Movie release Updates
ఈ మూవీతో తను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దర్శకుడిగా మరోసారి రాబోతున్నారు. ఇందులో కృతి వర్మ, విహాన్షీ హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ దీనిని సమర్పిస్తోంది. సురేందర్ కౌర్ నిర్మిస్తున్నారు. తేజిందర్ కౌర్ కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ప్రస్తుతం ఓ అందాల రాక్షసి పూర్తయింది.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమం పూర్తయిందని వెల్లడించారు షెరాజ్ మెహదీ. ఇదిలా ఉండగా మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. మార్చి 21న విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది ఓ అందాల రాక్షసి. దీనిని ప్రత్యేకించి క్రైమ్ , థ్రిల్లర్, హార్రర్ , సస్పెన్స్ ఉండేలా తీశాడు దర్శకుడు, నటుడు. ఇందులో టేకింగ్, మేకింగ్ ఆకట్టుకునేలా ఉండడం విశేషం. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఆకట్టుకునేలా ఉంది.
Also Read : Nag Ashwin Sensational Update :కల్కి 2 మూవీపై నాగ్ అశ్విన్ కామెంట్స్