తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో ?
Sharwanand : ప్రేమ… పెళ్ళి… పిల్లలు… సామాన్యులు ఏమోగాని సెలబ్రెటీలు మాత్రం ఓ ప్లాన్ ప్రకారం చేసుకుంటారు. ప్రేమించడానికి… పెళ్లి చేసుకోవడానికి… చివరకు పిల్లలను కనడం కూడా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంటారు. ప్రేమ, పెళ్ళి మాట ఎలాగున్నా సంతానం విషయానికి వచ్చేసరికి మాత్ర కొంతమంది సెలబ్రెటీలు చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. కొంతమంది అయితే గ్లామార్ పోతుందేమోనన్న భయంతో సరోగసీ లేదా దత్తతకు మొగ్గు చూపుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము.
అయితే టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ గా ఉంటూ ఓ ఏడాది క్రితమే పెళ్ళి చేసుకున్న శర్వానంద్(Sharwanand) తండ్రి కాబోతున్నాడు అనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గత ఏడాది జూన్ 3న జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో రక్షితా రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేసి పెళ్ళి చేసికున్నాడు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వివాహ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేసారు. జనవరిలో నిశ్ఛితార్ధం చేసుకున్న ఈ జంట ఆరునెలల తరువాత వివాహబంధంలో అడుగుపెట్టారు.
Sharwanand – తండ్రిగా శర్వానంద్ కు ప్రమోషన్ ?
పెళ్ళి చేసుకుని ఏడాదిన్నర తిరగకముందే రక్షితారెడ్డి… శర్వానంద్(Sharwanand) ను తండ్రిగా ప్రమోట్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రక్షితారెడ్డి… డెలివరీ వరకు కూడా అక్కడే ఉండటానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రక్షితకు తోడుగా ఉండేందుకు శర్వానంద్ కూడా అమెరికా వెళ్ళిపోయాడని… అక్కడే మరికొన్ని రోజులు ఉంటాడనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే శర్వానంద్ నుండి కాని అతని కుటుంబ సభ్యుల నుండి కాని ఈ విషయంలో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. శర్వానంద్ స్పందిస్తే తప్ప తనకు తండ్రి ప్రమోషన్ వచ్చిందా లేదా అనే క్లారిటీ వస్తుంది.
శర్వానంద్ తరువాత సినిమాపై ఆశక్తి
శర్వానంద్ చివరగా ఒకే ఒక జీవితం అనే సినిమాతో ప్రేక్షకులకు ముందు వచ్చాడు. అయితే దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. కొన్ని నెలల క్రింతం శర్వానంద్ తన 35వ సినిమాను ప్రకటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్లి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మరికొన్ని నెలలు శర్వానంద్ అమెరికాకు పరిమితం అయితే ఈ సినిమా సంగతి ఏంటి అనేది ఆశక్తిగా మారింది.
Also Read : KTR Rashmika : రష్మికకు కేటీఆర్ మద్ధతు