Sharwanand : సామజవరగమన మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన అబ్బరాజు మరో సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకునేందుకు రెడీ అయ్యాడు. ఇరువురు భామల కౌగిలిలో స్వామి అంటూ పాపులర్ సినిమా పాట నందమూరి బాలకృష్ణది. దీనిని ఆధారంగా చేసుకుని నారి నారి నడుమ మురారి అంటూ చిత్రమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్.
Sharwanand Movie Updates
ఈ కొత్త మూవీలో నటుడు శర్వానంద్(Sharwanand) కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. ఇరువురు భామల మధ్య నలిగి పోయే పాత్ర తనది. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సెంటిమెంట్ గా భావిస్తూ బాలయ్యతో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
నారి నారి నడుమ మురారి లుక్ మాత్రం అదుర్స్ అనేలా ఉంది. తనదైన టాలెంట్ తో మరోసారి సక్సెస్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ మూవీలో శర్వానంద్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ లో తళుక్కున మెరిసిన సంయుక్తా మీనన్ తో పాటు ఏజెంట్ మూవీతో పాపులర్ అయిన హీరోయిన్ సాక్షి వైద్య ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు.
ఇరువురు భామల కౌగిలిలో స్వామి..ఇరుకున పడి నలిగితివా అంటూ షేర్ చేసిన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Also Read : Hero Vijay Deverakonda : రౌడీ బాయ్ తో సెల్ఫీ దిగిన క్రికెటర్