Shahid Kapoor : ముంబై – బాలీవుడ్ నటుడు షహీద్ కపూర్(Shahid Kapoor) భయపెట్టేందుకు వచ్చాడు. తనతో పాటు అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే కలిసి నటించిన దేవా చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్బంగా ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఇది అందరికీ నచ్చుతుందని తెలిపాడు.
Shahid Kapoor Movie Updates
రిలీజైన ట్రైలర్ లో ఎలాంటి డైలాగులు లేక పోవడం విశేషం. షాహిద్ కపూర్ తుపాకీని మాత్రమే మాట్లాడేలా చేసింది. యాక్షన్ తో నిండిన, ఉత్సాహ భరితమైన ఈ ట్రైలర్ లో షాహిద్ కపూర్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. అతడిని పోకిరతనం నిండిన మాఫీయా డాన్ గా పిలుస్తున్నారు.
ముంబైని వణికిస్తున్న మాఫియా కల్చర్ ను ఇందులో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒక సన్నివేశంలో ఈ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా తనను పిలుచుకుంటాడు. ఒక వ్యక్తిని కాల్చడానికి రెండుసార్లు ఆలోచించని పోలీస్ అధికారి ట్రైలర్ చివరలో తుపాకీతో కాల్చడానికి వెనుకాడతాడు. అతని స్వభావాన్ని నిజంగా మార్చేది ఏమిటి ..? అనేది తెలుసు కోవాలంటే సినిమా ను థియేటర్ లో చూడాలి. విడుదలయ్యేంత వరకు వేచి ఉండక తప్పదు.
Also Read : Victory Venkatesh Movie : వెంకీ మామ మూవీ కలెక్షన్ల సునామీ