సినిమా రంగంలో చాలా మటుకు ఒకరంటే ఒకరికి పడదు. కానీ బాలీవుడ్ కు చెందిన బాద్ షా గా పిలుచుకునే షారుక్ ఖాన్ కు మాత్రం అలాంటి పట్టింపులు ఏవీ ఉండవు. తనకు కథ నచ్చిన వెంటనే తమిళ సినీ దర్శకుడు అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు అట్లీ. భారీ బడ్జెట్ తో సినిమా తీశాడు. ఏకంగా రూ. 1,000 కోట్ల క్లబ్ లోకి తీసుకు వెళ్లేలా చేశాడు. అదే జవాన్ మూవీ.
తాజాగా తన బర్త్ డేను పురస్కరించుకుని తమిళ సినీ రంగంలో బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక నటుడు జోసెఫ్ విజయ్. జవాన్ సక్సెస్ కావాలంటూ కోరాడు. అదే సమయంలో తన అభిమానులకు సైతం జవాన్ ను చూసి ఆదరించాలని పిలుపునిచ్చాడు.
తమిళ సినీ రంగంలో అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో అట్లీ కుమార్ కు అరుదైన అవకాశం ఇచ్చాడు విజయ్. వరుసగా మూడు సినిమాలు తీసి విస్తు పోయేలా చేశాడు. ఇవన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వం లో తళపతి విజయ్ నటించిన లియో చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. విజయ్ సర్ మీ మూవీ కోసం తాను వేచి చూస్తున్నానని , సక్సెస్ కావాలంటూ కోరాడు బాద్ షా షారుక్ ఖాన్.