Shah Rukh Khan: కింగ్ ఖాన్ సరికొత్త రొమాన్స్

కింగ్ ఖాన్ సరికొత్త రొమాన్స్

Shah Rukh Khan: కమర్షియల్ సినిమాల్లో యాక్షన్, ఐటెం సాంగ్స్ తో పాటు హీరోహీరోయిన్ల రోమాన్స్ కూడా కీలకంగా మారింది. ఇక ఇతర భాషలతో పోలిస్తే హిందీ సినిమాల్లో ఇది మరింత అధికంగా కనిపిస్తుంది. ఇమ్రాన్ హస్మి, రణ్ బీర్ కపూర్, రణ్ వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, షారూక్ ఖాన్ వంటి హీరోల హిట్ సినిమాల్లో… లిప్ టూ లిప్ కిస్ లతో పాటు హీరోయిన్స్ తో రొమాన్స్ తప్పని సరిగా కనిపిస్తాయి. అయితే రెగ్యులర్ రొమాన్స్ కు భిన్నంగా కింగ్ ఖాన్ షారూక్ సరికొత్త విధానాన్ని ఎంచుకున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం ‘జ‌వాన్’ లాంటి యాక్షన్ మూవీలో దీపిక పదుకునే తో కుస్తీ పడుతూ రొమాన్స్ చేసిన కింగ్ ఖాన్… తాజా సినిమా ‘డంకీ’ లో కూడా తాప్సీతో కుస్తీ రూపంలో రొమాన్స్ చేయడమే కారణమట.

Shah Rukh Khan – ‘జ‌వాన్‌’లో దీపికాతో.. ‘డంకీ’లో తాప్సీతో..

ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో షారూక్ ఖాన్‌(Shah Rukh Khan), తాప్సీ జంటగా నటిస్తున్న సినిమా ‘డంకీ’. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల కాబోతున్న ఈ సినిమాలో… షారూక్‌, దీపికల మ‌ధ్య ‘జ‌వాన్’ మూవీలో కుస్తీ సీన్ ఉన్నట్లే… ‘డంకీ’లోనూ తాప్పీతో రిపీట్ చేయ‌బోతున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో.. హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి షారుక్ సరికొత్త విధానాన్ని కనుగొన్నారంటూ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘డంకీ’ పాటలో తాప్సీతో కింగ్ ఖాన్ రొమాన్స్

ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘డంకీ’ సినిమా క్రిష్మస్ కానుకగా డిసెంబరు 21న విడుదల చేయనున్నారు. దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్ ను ప్రారంభించింది. దీనిలో భాగంగా ‘లుట్ పుట్ గయా..’ అనే సాంగ్‌ను ‘డంకీ డ్రాప్ 2’గా చిత్ర యూనిట్ విడుదల చేసింది. హార్డీ పాత్ర‌లో షారూక్‌, మ‌ను పాత్ర‌లో తాప్సీ మ‌ధ్య ఉండే ప్రేమ‌ను తెలియ‌జేసే ఈ పాట‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. కింగ్ ఖాన్ అభిమానులు, సినీ ప్రేక్ష‌కుల‌తో పాటు సంగీతాభిమానులు సైతం ఈ పాట‌కు ఫిదా అయ్యారు. అయితే ‘జ‌వాన్’ సినిమాలో కుస్తీ గ్రౌండ్ మ్యాజిక్‌ను మరోసారి షారూక్ ‘డంకీ’లోనూ తాప్సీతో రిపీట్ చేస్తున్నారంటూ కొంతమంది నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Double Ismart: డబుల్ ఇస్మార్ట్‌ కౌంట్‌డౌన్‌ షురూ అంటున్న పూరి

Sharukh Khan
Comments (0)
Add Comment