Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తన గారాల పట్టి సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేయడానికి సిద్ధపడిన సంగతి తెలిసిందే. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో సుహానా ఖాన్ ప్రధాన పాత్రలో ‘కింగ్’ అనే సినిమాతో షారుక్ తన కుమార్తె సుహానాని వెండితెరకు పరిచయం చేయడానికి సన్నాహాలు చేసారు. సుహానా తొలి సినిమా కావడంతో భారీ బడ్జెట్ తో యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న ఈ సినిమాలో అతిథి పాత్రలో షారూక్ ఖాన్ కూడా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను మూవీ మేకర్స్ ఇచ్చారు. ఈ సినిమాలో గురు శిష్యుల పాత్రల్లో తండ్రీ కూతుళ్ళు షారూక్, సుహానాలు కనిపించనున్నట్లు తెలిపారు.
Shah Rukh Khan Movie Updates
సుహానా నటిస్తున్న తొలి సినిమాను గ్రాండీయర్ గా నిర్మించాలనే ఉద్దేశ్యంతో భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో షారూక్(Shah Rukh Khan) ను కేవలం అతిథి పాత్రతో సరిపెట్టకుండా ఎక్కువ నిడివి.. మరియు ముఖ్య పాత్రలో చూపించాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు సుజోయ్ ఘోస్…. ఈ స్క్రిప్ట్ ను షారూక్ స్టార్ డమ్ కు అనుకూలంగా మార్పులు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో సుహానాకు మార్గనిర్దేశం చేసే గురువుగా షారూక్ కనిపించనున్నట్లు తెలుస్తుంది. ‘‘సుహానా తొలి థియేట్రికల్ చిత్రమిది. కాబట్టి దీన్ని భారీ బడ్జెట్‌తో మునుపెన్నడూ చూడని యాక్షన్ చిత్రంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేశారు. షారుక్ పాత్రకు సరిసమానంగా సుహానా పాత్ర ఉంటుంది. ఇందులో వీరిద్దరు గురుశిష్యులుగా కనిపించబోతున్నారు. ప్రతి సన్నివేశం ప్రత్యేకంగా ఉండడం కోసం విదేశీ స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా షూటింగ్ ను ఆగస్టులో ప్రారంభించనున్నారు.
Also Read : Tamannaah Bhatia: వేసవి ఉష్ణోగ్రతలకు వారం పాటు వెనక్కి వెళ్లిన తమన్నా ‘బాక్’ !