Shah Rukh Khan USA : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ , నయనతార కలిసి నటించిన జవాన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇంకా విడుదల కాకుండానే దుమ్ము రేపుతోంది. ఇప్పటికే పోస్టర్స్ , సాంగ్స్ కు భారీ ఆదరణ లభించింది.
Shah Rukh Khan USA Viral
జవాన్ లో బాద్ షా షారుక్ ఖాన్ ద్విపాత్రిభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇక అందాల ముద్దుగుమ్మ నయనతారతో పాటు లవ్లీ బ్యూటీ దీపికా పదుకొనే కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఇప్పటికే అమెరికాలో జవాన్ పై మరింత ఆసక్తి నెలకొంది.
ఓ వైపు రజనీకాంత్ నటించిన జైలర్ యుఎస్ లో రికార్డుల మోత మోగించింది. మరో వైపు ఓవర్సీస్ లో తన సత్తా చాటేందుకు షారుక్ ఖాన్(Shah Rukh Khan) కూడా రెడీగా ఉన్నాడు. తను దీపికాతో కలిసి నటించిన పఠాన్ ఏకంగా రూ. 1,000 కోట్లు కొల్లగొట్టింది.
ఇక ఈ జవాన్ ను షారుక్ ఖాన్ భార్య పేరుతో రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే అన్ని రైట్స్ ఇంకా ఇవ్వక పోయినా కనీసం రూ. 350 కోట్లకు పైగా ముందుగానే వచ్చినట్టు టాక్. ఇక యుఎస్ లో 431 స్థానాలలో, 1822 ప్రదర్శనలు ఇవ్వనుంది జవాన్. మొత్తం 12,340 టికెట్లు అమ్ముడు పోయాయి.
Also Read : Jawan Movie Audio : 30న జవాన్ ఆడియో లాంచ్