Ram Charan : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే తాజాగా హల్ చల్ జరుగుతోంది. రామ్ చరణ్(Ram Charan) తో కలిసి నటించ బోతున్నట్లు సమాచారం. ఇదే అవునంటోంది బాలీవుడ్ కూడా. త్వరలోనే ఈ ఇద్దరికి సంబంధించిన కాంబో గురించి క్లారిటీ రానుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తో రామ్ చరణ్ చర్చలు జరుపుతున్నారు. తను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనతో కలిసి ఆర్సీ 16లో నటిస్తున్నాడు.
Ram Charan – Shah Rukh Khan Combination
ఈ సినిమా షూటింగ్ రాకెట్ కంటే వేగంగా నడుస్తోంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది అందాల ముద్దుగుమ్మ జాహ్నవి కపూర్. ఇదే సమయంలో సుకుమార్ దర్శకత్వం వహించిన మూవీ పుష్ప2 రికార్డ్ బ్రేక్ చేసింది. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇది 2వ ప్లేస్ లో నిలిచింది. ఇదే మూవీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్. పుష్ప3 కూడా ఉంటుందని వెల్లడించారు. ఈ మూవీ 2028 సంవత్సరంలో రిలీజ్ కానుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం సుకుమార్ ఫోకస్ అంతా రామ్ చరణ్ తీయబోయే మూవీపైన ఫోకస్ పెట్టారు. ఇది పూర్తిగా గ్రామీణ, సామాజిక నేపథ్యంతో సాగనుందని టాక్. ఇందులో ఇద్దరు విలన్లు ఉండనున్నారని, వారిని కూడా సెలెక్ట్ చేశారిలో వారిలో ఒకరు జగపతి బాబు కాగా మరొకరు షారుక్ ఖాన్ . ఏది ఏమైనా బాద్ షా వస్తే ఆ మూవీ డిఫరెంట్ గా ఉండబోతోందన్నమాట.
Also Read : Court Movie Sensational : కలెక్షన్స్ లో కోర్టు కెవ్వు కేక