Shah Rukh Khan : ముంబై – అట్లీ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ మూవీ కోట్లు కొల్లగొడుతోంది. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం విడుదలైంది. షో ప్రారంభం అయినప్పటి నుండి నేటి దాకా కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా జైలర్ చత్రం సక్సెస్ సాధించడంపై నటుడు షారుక్ ఖాన్ స్పందించాడు.
Shah Rukh Khan Praises Jailer Movie
ఈ చిత్రం విజయం సాధిస్తుందన్న విషయం తమకు ముందే తెలుసన్నారు. ఎందుకంటే కథలో బలం ఉందన్నారు. ఈ క్రెడిట్ ఇవ్వాల్సింది కేవలం ఒకే ఒక్కడు దర్శకుడు అట్లీ కుమార్ కు దక్కుతుందన్నారు బాద్ షా.
భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగిందని , సినిమా సక్సెస్ అయ్యేలా , అన్ని అంశాలు ఉండేలా, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా తీయడంలో తనదైన ముద్ర కనబర్చాడని కితాబు ఇచ్చారు షారుక్ ఖాన్(Shah Rukh Khan). ఇదిలా ఉండగా అట్లీ తీసిన ఈ చిత్రంలో షారుక్ ఖాన్ , నయనతార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి నటించారు.
ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించి మ్యాజిక్ చేశాడు అనిరుధ్ రవిచందర్. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇక షారుక్ నటించిన పఠాన్ ఇప్పటికే రూ. 1,000 కోట్లు కొల్లగొట్టి రికార్డు బ్రేక్ చేసింది. తాజాగా జైలర్ ఆ దిశగా పరుగులు తీస్తోంది.
Also Read: Reba Monica John Vs Sakshi Vaidya