Shah Rukh Khan : జ‌వాన్ జోష్ బాద్ షా ఖుష్

వ‌ర‌ల్డ్ వైడ్ గా వ‌సూళ్ల వేట

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ , న‌య‌న‌తార క‌లిసి న‌టించిన జ‌వాన్ దుమ్ము రేపుతోంది. రిలీజ్ అయిన ప్ర‌తి చోటా భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. మూడు రోజుల్లో ఏకంగా రూ. 320 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది వ‌ర‌ల్డ్ వైడ్ గా. ఎక్క‌డ చూసినా పాజిటివ్ టాక్ రావ‌డంతో బాద్ షా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

Shah Rukh Khan Trending Collections

ఆయ‌న స‌క్సెస్ ను పంచుకుంటున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా వ‌స్తున్న ప్ర‌శంస‌ల‌కు, కామెంట్స్ కు షారుక్ ఖాన్(Shan Rukh Khan) స్వ‌యంగా జ‌వాబు ఇస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌ల‌కు అద్భుతంగా రిప్లై ఇస్తూ మ‌రింతో హుషారు తెప్పించేలా చేస్తున్నారు షారుక్ ఖాన్.

ఓ నెటిజ‌న్ వేసిన ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర ఆన్స‌ర్ ఇచ్చారు బాద్ షా. త‌మిళ సినీ రంగానికి చెందిన యంగ్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ జ‌వాన్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. షారుక్ ఖాన్ తో పాటు న‌య‌న‌తార‌, దీపికా ప‌దుకొనే, విజ‌య్ సేతుప‌తి న‌టించారు.

ఇక సినిమాకు సంబంధించి అనిరుధ్ ర‌విచంద‌ర్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది. ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ ఏడాదిలో బాద్ షా న‌టించిన ప‌ఠాన్ రూ. 1,000 కోట్లు కొల్ల‌గొట్టింది. తాజాగా విడుద‌లైన జ‌వాన్ సైతం అదే స్థాయిలో వ‌సూలు బాట ప‌ట్టింది.

Also Read : Sukhee Movie : సుఖీ శిల్పా శెట్టి ఖుషీ

Comments (0)
Add Comment