Hero Shah Rukh-Janhvi Song :బాద్ షా..జాహ్న‌వి సునా హై ఇష్క్ మే వైర‌ల్

హిందీ రొమాంటిక్ పాట యూట్యూబ్ లో సెన్సేష‌న్

Shah Rukh : బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ , అందాల ముద్దుగుమ్మ జాహ్న‌వి క‌పూర్ క‌లిసి న‌టించిన సాంగ్ సునా హై ఇష్క్ మే ప్ర‌స్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మిలియ‌న్స్ వ్యూస్ తో దూసుకు పోతోంది. పూర్తిగా రొమాంటిక్ మూడ్ తో చిత్రీక‌రించారు పాట‌ను. ఇందులో ఇద్ద‌రూ హైలెట్ గా నిలిచారు. ఆక‌ట్టుకునేలా డ్యాన్స్ చేయ‌డంతో ఫ్యాన్స్ తెగ ముచ్చ‌ట ప‌డుతున్నారు. ప‌దే ప‌దే చూసేందుకు ఇష్ట ప‌డుతున్నారు. దీంతో వ్యూయ‌ర్షిప్ రోజు రోజుకు పెరుగ‌తోంది.

Shah Rukh Khan-Janhvi Kapoor Song

దీనిని గ‌త నెల ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేశారు. గౌర‌వ్ మాలి పాడగా మ‌హ‌పుజ్ అలీ సంగీతం, సాహిత్యం అందించాడు. సూప‌ర్న‌ల్ డిజిట‌ల్ మీడియా దీనిని విడుద‌ల చేసింది. శ్రీ రాతి స్టూడియోలో రికార్డింగ్ చేశారు.

ప్ర‌స్తుతం షారుక్ ఖాన్(Shah Rukh) కొత్త ప్రాజెక్టుపై ఫోక‌స్ పెట్టాడు. ఇప్ప‌టికే త‌ను అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన జ‌వాన్ సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ఇందులో న‌య‌న తార‌తో పాటు విజ‌య్ సేతుప‌తి న‌టించారు. ఆ త‌ర్వాత రాజ్ కుమార్ హిరానీ ద‌ర్శ‌క‌త్వంలో జుంకీ లో కోలీక పాత్ర పోషించాడు. ఇందులో మ‌రో కీల‌క పాత్ర‌లో తాప్సీ ప‌న్ను న‌టించింది. ఆశించిన దానికంటే ఎక్కువ‌గా ఈ చిత్రాన్ని ఆద‌రించారు.

బాలీవుడ్ లో టాప్ హీరోగా కొన‌సాగుతున్న షారుక్ ఖాన్ కు సంబంధించి త్వ‌ర‌లోనే కీల‌క అప్ డేట్ రానుంద‌ని టాక్.

Also Read : Hero Salmaan- Sikandar :సికంద‌ర్ తేరా ఖ్వాబ్ సాంగ్ రిలీజ్

Janhvi KapoorShah Rukh KhanSongTrendingUpdates
Comments (0)
Add Comment