Shah Rukh Khan: ప్రముఖ నటుడు, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ అస్వస్థకు గురయ్యారు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీమ్ కు యజమానిగా వ్యవహరిస్తున్న షారుఖ్ ఖాన్ బుధవారం అమ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్‌తో జరిగిన మొదటి ఎలిమినేటర్ మ్యాచ్ కు హాజరయ్యారు. ఈ మ్యాచ్ లో తమ జట్టు విజయం సాధించిన అనంతరం అక్కడే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. రాత్రి అక్కడే బస చేసిన షారూఖ్ ఖాన్… ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీనితో వెంటనే ఆయనను అహ్మాదాబాద్ లోని కేడీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
Shah Rukh Khan Health Update
అహ్మాదాబాద్‌లో ఎండ తీవ్రతతో షారుఖ్ వడదెబ్బకు గురవడంతో పాటు మైల్డ్ హాట్‌స్ట్రోక్ రావడంతో వెంటనే కేడీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం షారుఖ్(Shah Rukh Khan) ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ఎలాంటి భయం లేదని వైద్యులు తెలియజేశారు. ఈక్రమంలో తోటి ఐపీఎల్ టీమ్ సహ యజమాని జూహీచావ్లా ఆస్పత్రికి వచ్చి షారుఖ్ ను పరామర్శించారు. ఈ నేపథ్యంలో కేడీ ఆస్పత్రి చుట్టూ పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. మరోవైపు షారుఖ్ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. షారుఖ్ ఆరోగ్యంపై ఆస్పత్రి యాజమాన్యం అధికారిక ప్రకటన చేయనున్నారు.
Also Read : Indian 2: కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ నుండి లిరికల్ సాంగ్ రిలీజ్ !