Shah Rukh Khan: కింగ్ ఖాన్ షారుఖ్ కు హ్యాండ్ ఇచ్చిన మరాఠా మందిర్

కింగ్ ఖాన్ షారూర్ కు హ్యాండ్ ఇచ్చిన మరాఠా మందిర్

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ముంబైలోని మరాఠా మందిర్. షారూక్ ఖాన్, కాజోల్ హీరోహీరోయిన్లుగా యశ్ చోప్రా నిర్మాతగా ఆదిత్య చోప్రా దర్శకత్వంలో 1995లో తెరకెక్కించిన సినిమా ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’. ఇండియాస్ మోస్ట్ రొమాంటిక్ సినిమాగా నిలిచిన ఈ సినిమాను ముంబైలోని మరాఠా మందిర్ లో దశాబ్దాలుగా ప్రదర్శిస్తున్నారు. 1995 నుండి నేటి వరకు ఏదో ఒక షోలో ఈ ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే'(డీడీఎల్జే) ను ప్రదర్శిస్తున్నారు. దీనితో మరాఠా మందిర్ రికార్డులకెక్కింది.

Shah Rukh Khan Viral

అంతటి ప్రాధాన్యత పొందిన ఈ మరాఠా మందిర్… ఇప్పుడు షారూక్ ఖాన్ కు హ్యాండ్ ఇచ్చింది. కింగ్ ఖాన్ నటించిన డంకీ సినిమాను మరాఠా మందిర్ ప్రదర్శించకపోవడమే దీనికి కారణమట. ప్రస్తుతం ఈ మరాఠా మందిర్ లో ఉదయం ఆట ‘డీడీఎల్జే’… మిగతా 3 షోలు యానిమల్ మూవీ ప్రదర్శిస్తున్నారట. శుక్రవారం నుండి ఈ హాల్ లో మొదటి ఆట ‘డీడీఎల్జే’కు… మిగతా 3 షోలు సలార్ కు కేటాయించారట. దీనితో మరాఠా మందిర్ లో షారూక్(Shah Rukh Khan) సినిమా రిలీజ్ అవ్వలేదనే విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… డంకీని కాదని, దానికి పోటీగా నిలిచిన సలార్ ను ప్రదర్శించడాన్ని షారూక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారట.

Also Read : Hero NTR: ‘ఏషియన్‌ వీక్లీ’ మ్యాగజైన్‌ టాప్‌ 50 జాబితాలో ఎన్టీఆర్‌

maratha mandirSharukh Khan
Comments (0)
Add Comment