Shah Rukh Khan: ఫ్యాన్సీ రేట్ కు డంకీ ఓటీటీ రైట్స్

ఫ్యాన్సీ రేట్ కు డంకీ ఓటీటీ రైట్స్... స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌ కూడా ఫిక్స్ !

Shah Rukh Khan: పఠాన్‌, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టి బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్(Shah Rukh Khan) హ్యాట్రిక్ కొట్టేందుకు డంకీతో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీనితో ఈ సినిమా ఏ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ అవుతుంది అనే ఆశక్తి అభిమానుల్లు ఇప్పటి నుండే ప్రారంభమయింది. డంకీ సినిమా విడుదల అయి 24 గంటల కాకముందే… ఈ సినిమా ఏ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ అవుతుంది అంటూ నెటిజన్లు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.

Shah Rukh Khan – జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్న డంకీ

డంకీ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ ఇప్పటికే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఈవెంట్‌లో జియో స్టూడియోస్ ప్లాట్‌ఫామ్‌లో రానున్న సినిమాలు, సిరీస్‌ల జాబితాను ఆవిష్కరించారు. ఆ లిస్ట్‌లో షారుక్ ఖాన్ డంకీ సినిమా కూడా ఉండటంతో ఈ సినిమా జియో సినిమాలో స్ట్రీమింగ్ కావడం ఖాయం అని బాలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తోన్న టాక్. ఇక ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే…. డంకీ చిత్రాన్ని జియో సినిమా రూ. 155 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా టాక్‌, కలెక్షన్స్ ఆధారంగా మూవీ మేకర్స్ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నారు. సాధరణంగా థియేటర్లలో రిలీజ్ నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేస్తారని తెలిసిందే. దీనిని బట్టి చూస్తే ఈ డంకీ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే కానుకగా డంకీని ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.

Also Read : Ram Gopal Varma: ఒక్క ఇన్ స్టా రీల్ తో ఆర్జీవి హీరోయిన్‌ గా మారిన మలయాళ బ్యూటీ

dunkiShah Rukh Khan
Comments (0)
Add Comment