Shah Rukh Khan : ఇస్రో చేసిన కృషికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇవాళ నా హృదయం ఆనందంతో ఊగి పోతోందని పేర్కొన్నారు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్. గురువారం ట్విట్టర్ వేదికగా స్టార్ హీరో స్పందించారు. తన సంతోషాన్ని పంచుకున్నారు.
Shah Rukh Khan Feels Proud
ప్రపంచ దిగ్గజ దేశాల సరసన భారత్ ను నిలిపినందుకు, నా సమున్నత భారత పతాకం అంతర్జాతీయ విపణి మీద సగర్వంగా తల ఎత్తుకునేలా చేసినందుకు నేను పేరు పేరునా భారత దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ తో పాటు శాస్త్రవేత్తలు, సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు.
మీరు చేసిన కృషి, ప్రయత్నం సామాన్యమైనది కాదని ప్రశంసించారు షారుక్ ఖాన్(Shah Rukh Khan). ఇదిలా ఉండగా ఇప్పటి వరకు అంతరిక్షంలోని చంద్రుని వద్దకు వెళ్లిన దేశాలు మూడే ఉన్నాయి. ఒకటి చైనా రెండు రష్యా మూడు అమెరికా మాత్రమే.
కానీ ఇప్పుడు అగ్ర దేశాలు విస్తు పోయేలా భారత దేశం కూడా చేరి పోయిందని, మన సాంకేతిక పరిజ్ఞానం అత్యుత్తమమైనదని నిరూపించారని , ప్రతి భారతీయుడు తల ఎత్తుకునేలా చేశారని కొనియాడారు షారుక్ ఖాన్.
రాబోయే కాలంలో ఇలాంటి అద్భుతాలు మరిన్ని చేపట్టాలని భారత్ మున్ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు దిగ్గజ నటుడు.
ఇక షారుక్ ఖాన్ తో పాటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఇస్రో కృషిని మెచ్చుకున్నారు.
Also Read : Rajinikanth : సైంటిస్టులకు రజనీకాంత్ సెల్యూట్