Sesham Miceil Fathima : సందేశాత్మక చిత్రాలే కాదు కామెడీని పండించే సినిమాలు మలయాళంలో వస్తున్నాయి. నేటివిటీకి దగ్గరగా ఉండే మూవీస్ ను జనం ఆదరిస్తున్నారు. గతంలో హీరోలు, హీరోయిన్లు డామినేట్ చేసే వారు. కానీ సీన్ మారింది. సిట్యూయేషన్ పూర్తిగా కేవలం కథలు బాగుంటేనే ఓకే చెబుతున్నారు. లేదంటే వెంటనే తిరస్కరిస్తున్నారు.
Sesham Miceil Fathima Teaser Viral
డైరెక్టర్లు సైతం ఇప్పుడు కథల్ని నమ్ముకుంటున్నారు. వాటి పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. తాజాగా మలయాళంంలో మను సి కుమార్ దర్శకత్వం వహించిన శేషమ్ మైక్ – ఇల్ ఫాతిమా మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. భారీ ఆదరణ చూరగొంటోంది.
ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) మలప్పురం నుండి ఫుట్ బాల్ అనౌన్సర్ గా నటించింది. ఈ చిత్రం కథానాయకుడి కథకు ఫుట్ బాల్ ఆటను నేపథ్యంగా ఉపయోగించుకునే తేలికపాటి వినోదాత్మక మూవీగా తెరెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
తన జట్టును ఎల్లప్పుడూ ఉత్సాహ పరిచే పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ నటించింది. ఆమెతో పాటు షాహీన్ సిద్దిఖ్ , సుధీష్ , సాబుమెన్ , మాలా పార్వతి, ఫెమినా జార్జ్ , సరస బాలుస్సేరి ఇతర పాత్రలలో ఒదిగి పోయారు.
Also Read : Hesham Abdul Wahab : గుండెల్ని కొల్లగొట్టిన ‘హేషమ్’