Bose Veerapaneni : సీనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు ‘బోస్ వీరపనేని’ కన్నుమూత

'వింతకథ' షూటింగ్ సమయంలో పై ఫొటోలో కళ్ళజోడు పెట్టుకుని గడ్డం కింద చేతులు పెట్టుకున్న వ్యక్తి...

Bose Veerapaneni : సూపర్ స్టార్ కృష్ణ, వాణిశ్రీ కాంబినేషన్‌లో ‘వింత కథ’ చిత్రాన్ని తీసిన దర్శకుడు బోస్ వీరపనేని ఈ రోజు ఉదయం విజయవాడ‌లో కన్ను మూశారు. ‘గ్రహణం విడిచింది’చిత్రానికి కూడా ఆయన దర్శకుడు. ఎన్టీఆర్‌కి సన్నిహితుడు‌గా పేరొందిన బోస్ మంగమ్మ శపథం,పుణ్యవతి కథానాయకుడు తదితర చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. బాపు దర్శకత్వం వహించిన సంపూర్ణ రామాయణం చిత్రానికి కో డైరెక్టర్ గా పని చేశారు. 80 ఏళ్ల బోస్ విజయవాడలో స్థిర పడ్డారు.

Bose Veerapaneni No More..

‘వింతకథ’ షూటింగ్ సమయంలో పై ఫొటోలో కళ్ళజోడు పెట్టుకుని గడ్డం కింద చేతులు పెట్టుకున్న వ్యక్తి. ప్రముఖ కళా దర్శకుడు సూరపనేని కళాధర్ మేనల్లుడు బోస్. ఆయన విఠలాచార్య, బాపు, జి. విశ్వనాదం, దాదా మిరసి వంటి దర్శకుల దగ్గర 15 చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. శోభన్ బాబు తో ఏరా అంటే ఏరా అనుకునేంత స్నేహం ఆయన సొంతం.

Also Read : Bhairavam Movie : ‘భైరవం’ సినిమా నుంచి మంచు మనోజ్ మాస్ అవతార్ లుక్

BreakingDirectorUpdatesViral
Comments (0)
Add Comment