Tagore Movie : మెగాస్టార్ ఠాగూర్ సినిమా పై సీనియర్ డాక్టర్ సంచలన వ్యాఖ్యలు

వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ఠాగూర్...

Tagore : ప్రముఖ ఆసుపత్రుల అధినేత, సెలబ్రిటీ డాక్టర్, సీనియర్ సర్జన్ డాక్టర్ గురువా రెడ్డి చాలా మందికి పరిచయమున్న పేరే. వైద్య వృత్తిలో అపార అనుభవం కలిగి, అనేక సర్జరీలు చేసిన ఆయనకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. కరోనా లాంటి గడ్డు పరిస్థితులలో సూడో విధానాలను తప్పుపడుతూ అనేక సూచనలు ఇచ్చారు. తాజాగా ఆయన ఒక పోడ్కాస్ట్ లో తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్నేహితుడైన గురువా రెడ్డి.. చిరు ఠాగూర్(Tagore) సినిమాపై మండిపడ్డాడు. మంచి సోషల్ మెసేజ్‌తో ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ సినిమాపై ఆయన ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారంటే..

Tagore Movie..

వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ఠాగూర్. ఈ సినిమాలో కార్పొరేట్ వైద్యశాలల్లో జరిగే మోసాలను చూపిస్తూ.. చనిపోయిన పేషంట్‌కి వైద్యం చేయడం, డబ్బు కట్టించుకున్నాకే పేషంట్‌ని అప్పచెప్పటం, ఫేక్ టెస్ట్‌లతో డబ్బులు గుంజడటం వంటి సీన్లను చూపించారు. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రజలు డాక్టర్లను దొంగల చూస్తున్నారని, మేము ప్రతిదీ వారికి నిరూపించుకోవాల్సి వస్తుందని, ఠాగూర్ సినిమాలో ఆ సీన్ ఎవరు రాశారో కానీ చెత్త సీన్ అని డాక్టర్ గురువా రెడ్డి మండిపడ్డారు. ఈ సినిమా ద్వారా అనేక ప్రైవేట్ ఆసుపత్రులు మూలాన పడ్డాయన్నారు. పవిత్రమైన డాక్టర్ వృత్తిని ఇలా చూపించడంపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే గురువా రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి సుపరిచితమే. ఇదే విషయాన్నీ గతంలో చిరుతో లంచ్‌లో ఉన్నపుడు మాట్లాడానని అన్నారు. దీనికి చిరు సమాధానంగా.. ఇంతకీ ముందు ఈ సీన్ మరింత కఠినంగా ఉంటె, నేనే కలగ చేసుకొని ఛేంజ్ చేయించ అని చెప్పారట.

Also Read : Adivi Sesh : అడివి శేష్ సరసన నటించేందుకు నిరాకరించిన ఆ హీరోయిన్లు

BreakingCinemaTagoreUpdatesViral
Comments (0)
Add Comment