Seerat Kapoor : యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ‘రన్ రాజా రన్’తో టాలీవుడ్ కు పరిచయమైన ముంబై బ్యూటీ సీరత్ కపూర్… అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించింది. కొరియోగ్రాఫర్ గా సినిమా కెరీర్ ను ప్రారంభించి… మోడల్ గా… హీరోయిన్ గా తెలుగు, హిందీ భాషల్లో రాణిస్తున్న సీరత్… అల్లు అర్జున్ పై కురిపిస్తున్న ప్రశంసలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవలే అల్లు అర్జున్ తో సీరత్ దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారడంతో బన్నీ నెక్ట్స్ సినిమాలో ఆమె ఛాన్స్ దక్కించుకుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఆ ప్రచారానికి బలం చేకూర్చుతున్నాయి.
Seerat Kapoor – బన్నీలో ఓ స్పార్క్ ఉంది… అది అందరినీ ఆకర్షిస్తుంది…
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముంబై బ్యూటీ సీరత్ కపూర్ మాట్లాడుతూ ‘‘బన్నీ నాకు వ్యక్తిగతంగా తెలుసు. అంత పెద్ద స్టార్ అయినా.. ఎంతో వినయంగా ఉంటాడు. తనతో ఉంటే సొంత మనిషితో ఉన్నట్లు ఉంటుంది. బన్నీలో ఓ స్పార్క్ ఉంటుంది, అది అందరినీ ఆకర్షిస్తుంది. తెరపై ఆయన ఎనర్జీ అందరం చూశాం. నేను తనతో కలిసి పనిచేసే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అంటూ అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించారు సీరత్ కపూర్(Seerat Kapoor). దీనితో ‘పుష్ప2’లో సీరత్ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
హీరోయిన్ గా మారిన కొరియోగ్రాఫర్
కొరియోగ్రాఫర్ గా ముంబైలో డ్యాన్స్ ఇనిస్ట్యూట్ ను నడుపుతున్న సీరత్ కపూర్… రణబీర్ కపూర్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా రాక్ స్టార్ కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా సినిమా కెరీన్ ప్రారంభించింది. ఆ తరువాత మోడల్, హీరోయిన్ గా మారి సుజిత్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కించిన ‘రన్ రాజా రన్’తో టాలీవుడ్ కు పరిచయమైంది. టాలీవుడ్ లో టైగర్, రాజుగారి గది-2, కొలంబస్, టచ్ చేసి చూడు వంటి సినిమాలు చేసింది. కొరియోగ్రాఫర్ కావడంతో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప-2లో ఐటెం సాంగ్ లో ఈమె నర్తించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. పుష్ప-1 లో ఊ అంటావా మామ.. ఊఊ అంటావా అంటూ టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే.
Also Read : Victory Venkatesh: పెద్దోళ్లు అలా… కుర్రాళ్లు ఇలా అంటున్న వెంకీ