Sayaji Shinde : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన నటుడు షిండే

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ గారు అపాయింట్‌మెంట్‌ దొరికితే ఆయన్ను కలిసి ఈ వివరాలన్నీ చెబుతా...

Sayaji Shinde : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తే, తన ఆలోచనని ఆయనతో పంచుకుంటానని నటుడు షాయాజీ షిండే(Sayaji Shinde) అన్నారు. దేవాలయాల్లో ప్రసాదంతోపాటు భక్తులకు ఒక మొక్కను ఇస్తే బాగుంటుందని, తాను ఇప్పటికే ఈ పని చేస్తున్నానని అన్నారు. తాజాగా ఆయన సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘మా నాన్న సూపర్‌హీరో’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా సుధీర్‌, షాయాజీ, ఆర్నా ‘బిగ్‌బాస్‌ సీజన్‌-8లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు షాయాజీ గురించి సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ఖాళీ ప్రదేశం కనపడితే చెట్లు నాటతారని హోస్ట్‌ నాగార్జునతో అన్నారు. దీంతో ఆశ్చర్యపోయిన నాగార్జున మొక్కలు నాటడం వెనుక ఉన్న కారణాన్ని అడిగి తెలుసుకున్నారు.

Sayaji Shinde Asking…

‘‘మా అమ్మగారు 97లో కన్ను మూశారు. ఆమె బతికి ఉన్నప్పుడు ఒక విషయం అడిగా ‘అమ్మా నా దగ్గర ఇంత డబ్బు ఉంది. కానీ, నేను నిన్ను బతికించుకోలేను. నేనేం చేయను’ అని బాధపడ్డాను. వెంటనే మరొక విషయం ఆమెకు చెప్పా. మా అమ్మగారి బరువుకు సమానమైన విత్తనాలను తీసుకుని, ఇండియా మొత్తం నాటుతానని అన్నాను. నేను నాటిన చెట్లు కొన్నాళ్లకు పెరిగి నీడను ఇస్తాయి. పూలు, పండ్లు ఇస్తాయి. వాటిని చూసినప్పుడల్లా మా అమ్మ గుర్తుకు వస్తుంది. మా అమ్మ తర్వాత నాకు భూమాత కూడా అంతే గుర్తొస్తుంది. సాధారణంగా దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రసాదాలు పంచుతారు. ప్రసాదంతోపాటు ఒక మొక్కను ఇేస్త బాగుంటుంది. దాన్ని భక్తులు తీసుకెళ్లి నాటితే అందులో భగవంతుడిని చూసుకోవచ్చు. మహారాష్ట్రలో మూడు దేవాలయ్యాల్లో నేను ఈ విధానం మొదలుపెట్టాను. అయితే, అందరికీ కాకుండా ఎవరైతే అభిషేకం చేస్తారో వారిలో సుమారు 100, 200 మందికి ప్రసాదంలాగా వీటిని ఇస్తారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) గారు అపాయింట్‌మెంట్‌ దొరికితే ఆయన్ను కలిసి ఈ వివరాలన్నీ చెబుతా. దేవుడి ప్రసాదంలాగా మొక్కలను అందరికీ పంచాలి. అవి నాటితే పెరిగి చెట్లు అవుతాయి. తర్వాత ఏడు జన్మలకు అవి పెరుగుతూనే ఉంటాయి’’ అని షాయాజీ షిండే చెప్పారు. ఆయన ఆలోచన నాగార్జున మెచ్చుకున్నారు. పవన్‌కల్యాణ్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉంది, అభిమానుల సంఖ్య ఎక్కువ. వారే ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తారని నాగార్జున, సుధీర్‌బాబు అన్నారు.

Also Read : Rajinikanth : 33 ఎల్లా తర్వాత ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తలైవా

AP Deputy CM Pawan KalyanSayaji ShindeUpdatesViral
Comments (0)
Add Comment