Save The Tigers : ఓ వైపు సినిమాలు దుమ్ము రేపుతుంటే మరో వైపు ఓటీటీలు హవా చెలాయిస్తున్నాయి. గత ఏడాది 2024లో భారీ ఎత్తున వెబ్ సీరీస్ లు స్ట్రీమింగ్ అయ్యాయి. వివిధ భాషల్లో వచ్చిన ఈ సీరీస్ లు అత్యధిక జనాదరణ పొందడం విశేషం. ఆర్ మాక్స్ మీడియా టాప్ వెబ్ సీరీస్ జాబితాను విడుదల చేసింది.
Save The Tigers Web Series in OTT
మొత్తంగా వెబ్ సీరీస్ లలో అత్యధికంగా చూసింది మాత్రం మీర్జాపూర్ 3 వెబ్ సీరీస్. బలమైన కంటెంట్ దీని సొంతం. అద్భుతమైన కథనం, సన్నివేశాల చిత్రీకరణ, ఉత్కంఠ రేపే మాటలు, నటీ నటుల అసాధారణ ప్రతిభ తోడు కావడంతో వ్యూయర్ షిప్ పరంగా నెంబర్ వన్ లో నిలిచేలా చేసింది. దీనిని ఏకంగా 30.8 మిలియన్ల మందికి పైగా చూసినట్లు టాక్.
మరో వెబ్ సీరీస్ స్క్విడ్ గేమ్ 2 రికార్డుల మోత మోగించింది. వరల్డ్ వైడ్ వెబ్ సీరీస్ లలో ఇదే టాప్. విదేశాలలోనే దుమ్ము రేపిన ఈ సీరీస్ తాజాగా ఇండియాను కూడా షేక్ చేసింది. ఇక భారత్ విషయానికి వస్తే అమెజాన్ మరోసారి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. నెట్ ఫ్లిక్స్ కంటే ఇందులోనే స్ట్రీమింగ్ అయిన చాలా వెబ్ సీరీస్ లు టాప్ లో కొనసాగుతుండడం విశేషం.
పంచాయత్ 3 వెబ్ సీరీస్ దేశీయ పరంగా నెంబర్ 2లో కొనసాగగా నెంబర్ 3లో హీరామండి – ది డైమండ్ బజార్ చేజిక్కించుకుంది. ఇక తెలుగు విషయానికి వస్తే సేవ్ టైగర్స్(Save the Tigers) వెబ్ సీరీస్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న బాలయ్య నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం కూడా ఆదరణ చూరగొంటోంది. మొత్తంగా ఇప్పుడు వెబ్ సీరీస్ ల హవా కొనసాగుతుండడం విశేషం.
Also Read : Beauty Rashmika : బాగున్నపుడే నిష్క్రమిస్తే బెటర్