Satyaraj: రజనీకాంత్‌ తో తనకు విభేదాలపై క్లారిటీ ఇచ్చిన సత్యరాజ్‌ !

రజనీకాంత్‌ తో నాకు విభేదాలపై క్లారిటీ ఇచ్చిన సత్యరాజ్‌ !

Satyaraj: రజనీకాంత్‌ కు తనకు మధ్య మనస్పర్థలు ఉన్నట్లు వస్తోన్న వార్తలపై సీనియర్ నటుడు సత్యరాజ్‌ స్పందించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. గతంలో తాను రజనీకాంత్‌ సినిమాను అంగీకరించకపోవడానికి గల కారణాన్ని వివరించారు. ‘నేను ఇండస్ట్రీకి వచ్చాక రజనీకాంత్ సినిమాల్లో రెండు సార్లు అవకాశం వచ్చింది. ఆ పాత్రలు నాకు నచ్చలేదు. అందుకే తిరస్కరించాను. అంతేకానీ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు’ అని సత్యరాజ్‌ స్పష్టం చేశారు. వీళ్లిద్దరూ కలిసి 38 ఏళ్ల తర్వాత ‘కూలీ’ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఏ పాత్ర చేస్తున్నారనే విషయం సత్యరాజ్‌ ఇప్పుడే చెప్పనన్నారు. చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరకు వేచిచూడాలన్నారు.

Satyaraj Comment

1986లో కావేరీ జల వివాదం సందర్భంగా సత్యరాజ్‌… రజనీకాంత్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్నుంచీ ఈ సీనియర్లు కలిసి నటించ లేదు. తాజాగా వీళ్లిద్దరిని ఒప్పించి ‘కూలీ’లో నటించేలా చేశారు లోకేశ్‌. ఇందులో సత్యరాజ్‌.. రజనీకాంత్‌ స్నేహితుడిగా కనిపించనున్నారని సన్నిహితవర్గాలు తెలిపాయి. ‘కూలీ’ విషయానికొస్తే లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. కమల్‌హాసన్‌ అతిథి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో రజనీకి జోడీగా శోభన నటించనున్నారు.

Also Read : Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ ‘జ్యువెల్‌ థీఫ్‌’ షూటింగ్ పూర్తి !

SatyarajSuper Star Rajanikanth
Comments (0)
Add Comment