Zebra Movie OTT : ఓటీటీలో అలరిస్తున్న హీరో సత్యదేవ్ ‘జీబ్రా మూవీ

కథవిషయానికి వస్తే.. సూర్య (సత్యదేవ్) ప్రైవేటు బ్యాంకు ఎంప్లాయ్...

Zebra : డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో హీరో సత్యరాజ్ నటించిన లేటేస్ట్ సినిమా జీబ్రా(Zebra). ఇందులో ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్ హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 22న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇటీవల హయ్యేస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా నిలిచింది. పాజిటివ్ టాక్ తో మొదటి వారాల్లో మంచి వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా డిసెంబర్ 20 నుంచి అంటే ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను మంచి ధరకే కొనుగోలు చేసింది ఆహా. ఇటీవల ఈ సినిమాకు స్పెషల్ కాంటెస్ట్ కూడా నిర్వహించింది చిత్రయూనిట్.

Zebra Movie OTT Updates

ఈ సినిమాలో హీరో సత్యదేవ్ ఆహా ఓటీటీ నిర్వహిస్తున్న జీబ్రా ప్రత్యేక పోటీలో గెలిచిన వారికి తనకు ఇష్టమైన వాచ్, గ్లాసెస్ బహుమతిగా అందిస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబ్ చేసి..సినిమా చూసే అభిమానులకు సత్యదేవ్, నటుడు సునీల్ తోపాటు లీడ్ చేసిన యాక్టర్స్ ధరించే ప్రత్యేకమైన వస్తువులను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జీబ్రా మూవీ తెలుగుతోపాటు తమిళంలోనూ అందుబాటులోకి వచ్చేసింది.

కథవిషయానికి వస్తే.. సూర్య (సత్యదేవ్) ప్రైవేటు బ్యాంకు ఎంప్లాయ్. బ్యాంకింగ్ వ్యవస్థతోపాటు అందులోని లోతుపాతులపై పూర్తిగా అవగాహన ఉంటుంది. తన బ్యాంకులోనే పనిచేసే స్వాతిని (ప్రియా భవానీ శంకర్)ను ఇష్టపడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే స్వాతి పొరపాటున ఓ వ్యక్తి ఖాతాలో జమ చేయాల్సిన డబ్బును మరొకరి ఖాతాలో జమ చేస్తుంది. దీంతో తన తెలివితేటలతో స్వాతిని ఆ సమస్య నుంచి కాపాడతాడు సూర్య. అదే సమయంలో బ్యాంకులో జరుగుతున్న స్కామ్ గురించి తెలుసుకుంటాడు. దీంతో సూర్యకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సినిమా.

Also Read : Director Shankar : రామ్ చరణ్ స్క్రీన్ ప్రెసెన్స్ ను ప్రశంసించిన డైరెక్టర్ శంకర్

MoviesOTTSatyadev KancharanaTrendingUpdatesViralZebra
Comments (0)
Add Comment